బాబు అక్రమంగా దోచుకున్న విషయం నిజం కాదా..?

మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి

  నెల్లూరు జిల్లా: చంద్రబాబు అక్రమంగా దోచుకున్న విషయం నిజం కాదా..? అంటూ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు తప్పు చేయలేదని ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎల్లో మీడియా కష్టపడుతోందని దుయ్యబట్టారు. కోర్టులో చంద్రబాబు లాయర్లు భిన్న వాదనలు వినిపిస్తున్నారన్నారని విమర్శించారు. తండ్రి అరెస్ట్ అయితే కొడుకు ఢిల్లీలో కూర్చుని వ్యవస్థలను మేనేజ్ చేయాలని చూశాడంటూ ధ్వజమెత్తారు.

ఆదివారం ఆయన నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బాబు చీకట్లో కలిసిపోయాడు.. ఆయన జీవితం చీకటిమయం అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతిని ఇంటింటికి తెలియజేయాలని లోకేష్‌ చెప్పాడు. మంత్రి స్థాయిలో ఉన్న రోజాను విమర్శించడం సిగ్గుచేటు. టీడీపీ నేతల నోటికి అడ్డూ అదుపూలేకుండా పోయింది’’ అంటూ మంత్రి ధ్వజమెత్తారు.

స్కిల్ డెవలప్‌మెంట్ నిధులు దారి మళ్లాయి
‘టీడీపీ అబద్ధాలు మాట్లాడుతోంది. టీడీపీకి కాంతి లేకుండా చేస్తాం. దర్యాప్తులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డట్లు తేలింది.  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ నిధులు  దారి మళ్లాయి. చంద్రబాబు కోర్టులో తన నిజాయితీ నిరూపించుకోవాలి - రాష్ట్రంలో వ్యవస్థలు బాగానే ఉన్నాయి. సోమిరెడ్డి నాపై రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు - నాపై సోమిరెడ్డి పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకోవాలి’ అని సవాల్‌ విసిరారు మంత్రి కాకాణి.

సీఎం వైయ‌స్ జగన్ అభివృద్ధి చేసి చూపించారు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ: అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని సీఎం వైయ‌స్ జగన్ అభివృద్ధి చేసి చూపించారని  ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ‘‘విద్య, వైద్య రంగాలలో ఎలాంటి మార్పు వచ్చిందో జనం చూస్తూనే ఉన్నారు. ప్రతి రంగంలోనూ జగన్ తనదైన అభివృద్ధి ముద్ర వేశారు. ఏ పల్లెకి వెళ్లినా అభివృద్ధి ఆనవాళ్లు కనబడుతున్నాయి. ఈ విషయాలనే ప్రతి ఇంటికీ వెళ్లి వివరిస్తాం. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం రేపు ప్రారంభం అవుతుంది. రానున్న రోజుల్లో చేపట్టాల్సిన అంశాలపై సీఎం వైయ‌స్ జగన్ దిశానిర్దేశం చేస్తారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన పనిలేదంటూ ఎమ్మెల్యే విష్ణు కొట్టిపారేశారు.

తాజా వీడియోలు

Back to Top