రైతు సంక్షేమ ప్రభుత్వం ఇది

అసెంబ్లీలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

అమ‌రావ‌తి:  ఇది రైతు సంక్షేమ ప్ర‌భుత్వ‌మ‌ని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వం రైతుల్ని మోసం చేసింద‌ని విమ‌ర్శించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం వైయ‌స్‌ జగన్‌ సిద్ధాంతమ‌న్నారు. ఆ దిశ‌గా వ్య‌వ‌సాయ రంగానికి పెద్ద‌పీట వేశార‌ని, రైతు భ‌రోసా పేరుతో అన్న‌దాత‌ల‌ను వ్య‌వ‌సాయంలో ప్రోత్స‌హిస్తున్నార‌ని, కోవిడ్‌ సంక్షోభంలోనూ మా ప్రభుత్వం రైతులను ఆదుకుంద‌న్నారు.  రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంద‌ని చెప్పారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామ‌ని  మంత్రి వెల్ల‌డించారు. 

Back to Top