అమరావతి: అసెంబ్లీలో టీడీపీ రౌడీయిజానికి ఎవరూ భయపడరని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. దేవాలయం లాంటి అసెంబ్లీని ప్రతిపక్ష సభ్యులు కించపరిచారు. చిల్లర కోసమే విజిల్స్ వేస్తున్నారని మండిపడ్డారు. బజారు కూతలు కూస్తే ఊరుకునేది లేదు. దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాలు విసిరారు. బాలకృష్ణ రీల్ హీరో.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి రియల్ హీరో అని అభివర్ణించారు. అయితే, రీల్ హీరోలు సభలో తొడలు కొడితే రియల్ హీరోలు అయిపోరు అంటూ ఎద్దేవా చేశారు.. చంద్రబాబు రూ.370 కోట్లు దోచుకుని అడ్డంగా దొరికిపోయాడు అని మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా చేశాడు కాబట్టి చంద్రబాబు దోచుకోవడానికి అర్హుడు అనేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సభలో చర్చ జరగకుండా టీడీపీ నేతలు ఎందుకు పారిపోతున్నారు? అని నిలదీశారు. అనుచితమైన ప్రవర్తనతో వ్యవహరించేవాడు అసలు నటుడే కాదు అంటూ బాలయ్యపై కాకాణి మండిపడ్డారు. దేవాలయం వంటి అసెంబ్లీలో తాను చేసిన పనికి ఒక కళాకారుడిగా బాలకృష్ణ సిగ్గుపడాలన్న ఆయన.. టీడీపీ నేతలకు ఇదే నా సవాల్.. మీరు నీతిమంతులైతే.. దమ్ము, ధైర్యం ఉంటే రండి చర్చిద్దాం.. చంద్రబాబు దోపిడీ పై వివరింగా చర్చిద్దాం.. మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై పూర్తి స్థాయిలో చర్చిద్దాం అంటూ టీడీపీ సభ్యులకు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చాలెంజ్ విసిరారు.