2024 ఎన్నిక‌ల్లో టీడీపీ అడ్ర‌స్ గ‌ల్లంతు ఖాయం

చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌

వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి 

నెల్లూరు: మూడేళ్ల పాల‌న‌లోనే చ‌రిత్ర‌లో నిలిచిపోయే సంక్షేమం అందించిన ఘ‌న‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కే సొంత‌మ‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి అన్నారు. రైతుల‌కు అన్ని విధాలుగా ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తోంద‌ని చెప్పారు. నెల్లూరులో నిర్వ‌హించిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశానికి మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి హాజ‌రై మాట్లాడారు. కుల‌, మ‌త‌, ప్రాంత‌, వ‌ర్గ‌, చివ‌ర‌కు పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమాలు అందిస్తున్నామ‌న్నారు. సంక్షేమ ప‌థ‌కాల‌తో పేద‌ల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయ‌ని చెప్పారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తోంద‌ని, భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తోందన్నారు. పేద‌లు సంతోషంగా ఉంటే ఓర్వ‌లేని ప్రతిపక్షం అక్కసుతో అసత్య ప్ర‌చారాలు చేస్తోంద‌ని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి మండిప‌డ్డారు. 

ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుకి, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్‌కి చాలా వ్యత్యాసం ఉంద‌న్నారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన ఘనత సీఎం వైయ‌స్ జగన్‌కే దక్కుతుంది. రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించి ముఖ్యమంత్రి మహిళా పక్షపాతిగా నిలిచారని గుర్తుచేశారు. క‌రోనా కారణంగా రెండేళ్లు పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకోలేకపోయామ‌ని చెప్పారు. శరీరంలో అవయవాలు ఎంత ముఖ్యమో పార్టీకి కార్యకర్తలు అంతే ముఖ్యమ‌న్నారు. చంద్రబాబు చేత‌గానిత‌నం వ‌ల్లే కాంట్రాక్టర్లకు ఇబ్బందులు వచ్చాయ‌న్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అడ్ర‌స్ గ‌ల్లంత‌వుతుంద‌ని తెలిసే చంద్ర‌బాబు కుట్ర‌లు కుతంత్రాలు చేస్తున్నాడ‌ని మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి మండిప‌డ్డారు. 

తాజా వీడియోలు

Back to Top