నెల్లూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఏ రాష్ట్రంలో, ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ నాయకత్వంలో 8వ తరగతి విద్యార్థులకు అత్యంత విలువైన బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. సీఎం వైయస్ జగన్ పుట్టిన రోజున ప్రారంభమైన ఈ ట్యాబ్‌ల పంపిణీ వారం రోజుల పాటు రాష్ట్రంలో పండుగలా సాగుతోందని చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 8వ తరగతి విద్యార్థులకు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ట్యాబ్‌లు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 8వ తరగతి చదువుతున్న 5.18 లక్షల మంది విద్యార్థులకు, టీచర్లకు విలువైన ట్యాబ్‌లు అందించిన ఘనత సీఎం వైయస్ జగన్‌దన్నారు. విద్యార్థుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిరంతరం పరితపిస్తున్నారన్నారు. మనబడి నాడు - నేడుతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారని గుర్తుచేశారు. విద్యార్థులంతా బాగా చదువుకోవాలని, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రఖాత్యలు తీసుకోవాలని సూచించారు.