చంద్రబాబు, రజనీకాంత్‌ తోడు దొంగలే..

మంత్రి  జోగి రమేష్‌

అందుకే బాబుపై రజనీకాంత్‌ పొగడ్తలు

ఎన్టీఆర్‌ను వీళ్లే చంపి దండలేసి దండం పెడతారా..?

ఒక వెన్నుపోటుదారునికి మరో వెన్నుపోటు దారుడు మద్దతా..?

వెన్నుపోటుదారులంతా ఒకే వేదికను పంచుకున్నారు

చంద్రబాబు ఒక క్రిమినల్‌..ఆయన జీవితమే ఒక రక్తచరిత్ర

కేంద్రంలో చక్రం తిప్పినప్పుడు భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయావ్‌..?

ఎన్టీఆర్‌ మరణించిన 27 ఏళ్ల తర్వాత స్మారక చిహ్నం గుర్తొచ్చిందా..?: 

బావతో కలిసి బాలకృష్ణ తండ్రిని పైకి పంపించాడు

చంద్రబాబు, బాలకృష్ణలు నా వారసులని ఎన్టీఆర్‌ ఏనాడూ చెప్పలేదు

తడిగుడ్డతో గొంతుకోసే చంద్రబాబుదే రక్తచరిత్ర

రంగా, పింగళి దశరథరామ్‌లను పొట్టపెట్టుకున్న చంద్రబాబుది రక్తచరిత్ర

ఎవరిది రక్తచరిత్రో చర్చిద్దాం రా..చంద్రబాబూ: మంత్రి  జోగి రమేష్‌

ఎన్టీఆర్‌ను చంపేసి మళ్లీ తానే దండేయడమే చంద్రబాబు విజన్‌

చంద్రబాబునాయుడు డ్రామాలను చూసి ఎన్టీఆర్‌ ఆత్మ ఘోషిస్తుంది

ఈ యుగానికి యుగపురుషుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు

ఈ యుగానికి నరరూప రాక్షసుడు నారా చంద్రబాబునాయుడు

చంద్రబాబు, లోకేశ్‌లు కేవలం కాపీ క్యాట్‌లు మాత్రమే

తాడేప‌ల్లి: చంద్రబాబు, రజనీకాంత్‌ తోడు దొంగలే..అని మంత్రి  జోగి రమేష్ విమ‌ర్శించారు.  ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు కాదు..ఎన్టీఆర్‌ను చంపిన ఖూనీకోరుల సంబరాలు అని టైటిల్‌ సరిగ్గా సరిపోయేది అభిప్రాయ‌ప‌డ్డారు. 27 ఏళ్ల క్రితం ఎన్టీఆర్‌ను తడిగుడ్డతో గొంతుకోసి చంపిన ఖూనీకోరులంతా ఒక వేదిక మీదకు వచ్చారు. వారంతా ఎన్టీఆర్‌కు దండ వేసి, దండం పెట్టి ఆయన్ను పొగుడుతున్నారు.27 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ చేస్తావా..?
ఈ 27 ఏళ్ళలో 14 ఏళ్లు చంద్రబాబు సిఎంగా ఉన్నారు. కేంద్రంలో సంకీర్ణంలో ఉన్నాడు
రాష్ట్రపతి, స్పీకర్, ప్రధానులను నియమించి కేంద్రంలో చక్రం తిప్పిన నువ్వు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించలేకపోయావా..? అని నిల‌దీశారు. కేంద్రంలో చక్రం తిప్పినప్పుడు ఏం పీకావ్‌ నారా చంద్రబాబునాయుడు. ఇప్పుడు శతజయంతి ఉత్సవాల్లో ఈ ఖూనీకోరులంతా కలిసి ఎన్టీఆర్‌కి భారతరత్న ఇప్పిస్తారట..ఎన్టీఆర్‌కు స్మారక చిహ్నం కట్టిస్తారట..ఈ నరరూప రాక్షసులు, ఈ దుర్మార్గుడైన చంద్రబాబుకు భారతరత్న ఇప్పించాలని అప్పుడు తెలియదా..?.ఇప్పుడొచ్చి స్మారక చిహ్నం నిర్మించాలని అప్పుడు తెలియలేదా..?

ఏ ముఖం పెట్టుకుని దండేసి దండం పెడుతున్నావ్‌ రజనీకాంత్‌..?
తమిళనాడు నుంచి రజనీకాంత్‌ వచ్చి వత్తాసు పలుకుతున్నాడు. చంద్రబాబు యంగ్‌ అంటూ పొగుడుతున్నాడు
ఎన్టీఆర్‌ పదవీచ్యుతుడు కావడంలో, చనిపోవడంలో ఆ రోజు రజనీకాంత్‌ పాత్ర కూడా ఉంది.
ఆ రోజు రజనీకాంత్‌ కూడా చంద్రబాబు పక్కన, రామోజీ పక్కన కూర్చున్నాడు
వీరంతా కలిసి కుట్రపన్నే ఎన్టీఆర్‌ను పైకి పంపించారు. 
మళ్లీ సిగ్గులేకుండా ఏ ముఖం పెట్టుకుని వచ్చి ఎన్టీఆర్‌కు దండేసి దండం పెడుతున్నారు.
వీళ్లకి తోడు ఎన్టీఆర్‌ కొడుకు బాలకృష్ణ ఒక సిగ్గులేని మనిషి
నీ తండ్రిని బావ చంపితే..ఆ బావకు వత్తాసు పలికి, మీ నాన్నను పైకి పంపించి ఇప్పుడు శతజయంతి ఉత్సవాలు చేస్తున్నారు
ఎన్టీఆర్‌ కడుపున మీరు అసలు ఎలా పుట్టారు..?

చంద్రబాబు దొంగ, నయవంచుకుడని ఎన్టీఆర్‌ చెప్పాడు:
ఇప్పుడు చంద్రబాబుకు 73 ఏళ్లు..ఆ 73 ఏళ్లప్పుడే కదా ఎన్టీఆర్‌ను చంద్రబాబు పైకి పంపించాడు
ఏ రోజైనా ఎన్టీఆర్‌ చంద్రబాబును పొగిడిన సందర్భాలు ఉన్నాయా..?
ఎన్టీఆర్‌ ఏనాడైనా చంద్రబాబు కానీ, బాలకృష్ణ కానీ నా వారసుడు అని ఎన్టీఆర్‌ చెప్పాడా..?
ఎన్టీఆర్‌ చెప్పిందల్లా చంద్రబాబు దొంగ, నయవంచకుడు, వెన్నుపోటు దారుడు, తడిగుడ్డతో గొంతులు కోస్తాడని చెప్పాడు
చంద్రబాబు రాజకీయ తార్పుడుగాడు అని చెప్తూ, స్వయంగా పుస్తకంలో కూడా రాశాడు
ఎన్టీఆర్‌ చెప్పిన ఈ మాటలన్నిటినీ నిన్నటి ఉత్సవాల్లో ప్రదర్శిస్తే బాగుండేది.
సంబరాలు ఎన్టీఆర్‌కు చేయలేదు. ఎన్టీఆర్‌ను చంపిన ఖూనీకోరులు సంబరాలు చేసుకున్నారు

తడిగుడ్డలతో గొంతుకోసే చంద్రబాబుదే రక్తచరిత్ర:
ఎవడిదిరా రక్తచరిత్ర...దమ్ముంటే చర్చకు రా..చంద్రబాబూ
తడిగుడ్డతోనే గొంతులు కోసే రక్తచరిత్ర చంద్రబాబుదే
పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని, ఎన్టీఆర్‌ ట్రస్టును కొట్టేసిన చంద్రబాబుది రక్తచరిత్ర
చంద్రబాబు తనకు మద్దతు పలికిన హరికృష్ణ, దగ్గుపాటి వెంకటేశ్వరావు, ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులను గొంతు కోశాడో ప్రజలకు చూపించాలి
చంద్రబాబు రక్తంలోనే వెన్నుపోటు ఉంది. ఆయన చరిత్రే వెన్నుపోటు
ఈ యుగానికి యుగపురుషుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గారు
ఈ యుగానికి నరరూప రాక్షసుడు నారా చంద్రబాబునాయుడు
వెన్నలాంటి మనసున్న మంచి మనిషి వైఎస్‌జగన్‌
రక్తచరిత్రపై చంద్రబాబుతో చర్చకు సిద్ధం..దమ్ముంటే రావాలి.
నీ చరిత్రేమిటి..మా నాయకుడు చరిత్ర ఏమిటనేది చర్చించుకుందాం
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి కనీసం ఒక్క పథకం పేరు కూడా చెప్పలేని చంద్రబాబు ఒక నాయకుడుగా చలామణి అవుతున్నాడు
ప్రజల గడప వద్దకు వెళ్దాం పదా...నీ చరిత్రేమిటో తెలుసుకుందాం
విజయవాడ నగరంలో వంగవీటి మోహనరంగాని బాంబులు, గొడ్డళ్లు, కత్తులతో నరికి చంపించిన రక్తచరిత్ర చంద్రబాబుదే
పింగళి దశరథరామ్‌ హత్యచేసిన రక్తచరిత్ర కారణం చంద్రబాబే
ఐఏఎస్‌ రాఘవేంద్రరావు హత్యచేసిన రక్తచరిత్ర నీది కాదా చంద్రబాబూ..? ఎంతో మందిని పొట్టన పెట్టుకుని రక్తచరిత్ర చంద్రబాబుదే.
ప్రజలు సిఎం జగన్‌ గారిని తన కుటుంబంలో ఒక సభ్యునిగా చేసుకుంటే.. మీరు మాత్రం రక్తచరిత్ర అంటూ కారుకూతలు కూస్తున్నారు

కాపీ క్యాట్‌లు చంద్రబాబు, లోకేశ్‌...:
వైఎస్సార్‌ గారు పాదయాత్ర చేస్తే పనికిమాలిన చంద్రబాబు పాదయాత్ర చేశాడు.
వైఎస్‌ జగన్‌ గారు ప్రజాసంకల్పయాత్ర చేస్తే చంద్రబాబు కొడుకు లోకేశ్‌  పాదయాత్ర అంటూ పాక్కుంటూ నడుస్తున్నాడు
మమ్మల్ని చూసి కాపీ కొట్టడం తప్ప మీరు చేస్తుందేమిటి..?
మేం నారాసుర రక్తచరిత్ర అని పుస్తకం వేస్తే దాన్ని కాపీ కొట్టి ఏదో రక్తచరిత్ర అంటూ పుస్తకాలు వేసుకుంటున్నారు.
మా పథకాలను మీరిచ్చేది ఏమిటి..? పద్నాలుగేళ్లు ఏ పీకలేక ఇప్పుడు జగన్‌గారి అడుగులో అడుగు వేయడానికి వస్తున్నారా..?

ఎన్ని వాతలు పెట్టుకున్నా జగన్‌ గారి క్రేజ్‌ నీకు రాదు లోకేశ్‌..:
లోకేశ్‌ ఎన్ని పిల్లిగంతులు వేసి, పులిలా వాతలు పెట్టుకున్నా జగన్‌ గారి స్టైల్‌లో వెళ్లాలని చూసినా చేతకాదు
వైఎస్‌ జగన్‌ గారు మనసుతో పాదయాత్ర చేశారు. ప్రజల కష్టాలను ఆయన దగ్గరుండి చూశాడు. బాధలు, ఆవేదన, ఆక్రోశాలను విన్నాడు
అలా విన్నాడు కాబట్టే ఇప్పుడు ఈ అభివృద్ధి, సంక్షేమం..అందుకే రూ.2.08 లక్షల కోట్లు ప్రజల గడపకు చేరింది
డ్రామా సెట్టింగులు వేసుకుని పాదయాత్రలు చేస్తే జగన్‌ గారిలా క్రేజ్‌ కూడా రాదు.

మీ రక్తచరిత్రలో భాగస్వామి కాబట్టే రజనీకాంత్‌ పొగడ్తలు:
ఎక్కడి నుంచో ఏమీ తెలియని రజనీకాంత్‌ వచ్చి మిమ్మల్ని పొగడటం కాదు. అతనికి కూడా మీ రక్తచరిత్రలో భాగం ఉంది కాబట్టి మిమ్మల్ని పొగిడుతున్నాడు
ఈ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కరైనా చంద్రబాబును పొగుడుతారా..?
వీళ్ల కుటుంబంలో ఒక యువ హీరో ఉన్నాడు కదా..అతను వచ్చి నిన్ను పొగడొచ్చుగా..?
మీ డ్రామాలు, కనికట్లు చూసే ప్రజలు మిమ్మల్ని 23 సీట్లకు పరిమితం చేశారు
చంపేసి మళ్లీ రోడ్లమీదకు వచ్చి ఓట్లడుగుతారా..?
చంద్రబాబును, ఆయన కొడుకును టీడీపీని ప్రజలు తాటతీసి వదులుతారు
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభిమానం పొందే పరిపాలన నేడు రాష్ట్రంలో కొనసాగుతోంది
మీలాగా మావాళ్లే బాగుపడాలి అనే పరిపాలన చేయడం లేదు
విశాల మనసున్న ముఖ్యమంత్రి పరిపాలనలో అన్ని వర్గాల వారు సుభిక్షంగా ఉన్నారు
ఎన్టీఆర్‌ పేరుతో ఓట్లు అడుక్కోవాలని బయలు దేరితే ప్రజలు ఒప్పుకోరు.

నిజమైన ఎన్టీఆర్‌ అభిమానులు తండ్రీ కొడుకులను ప్రశ్నించాలి:
నిజమైన ఎన్టీఆర్‌ అభిమానులు చంద్రబాబు, లోకేశ్‌లను చెప్పుతో కొట్టాలి
ఎన్టీఆర్‌ను చంపి 27 ఏళ్ల తర్వాత ఆయన బొమ్మ పెట్టి దండం పెట్టడం ఏమిటని ప్రశ్నించాలి.
నిజమైన ఎన్టీఆర్‌ అభిమానులు ఓటు అనే ఆయుధంతో కొట్టండి. ఎన్టీఆర్‌ అభిమానులందరూ చంద్రబాబును, తాతా తాతా అంటున్న ఆ లోకేశ్‌ని కూడా నిలదీయాలి.
చంద్రబాబు వళ్లంతా, వయసంతా, రాజకీయ జీవితం అంతా రక్తచరిత్రే
చంద్రబాబునాయుడుని చూసి ఎన్టీఆర్‌ ఆత్మ ఘోషిస్తుంది
పైనుంచి దుర్మార్గుడు, నరరూపరాక్షసుడు అని ఆయన ఆత్మ ఘోషిస్తుంది.

ఎన్టీఆర్‌ను చంపేసి మళ్లీ తానే దండేయడమే చంద్రబాబు విజన్‌:
రజనీకాంత్, చంద్రబాబుల వయసు 74 ఏళ్లు ఉంటుంది...
2047 అంటున్నారు..అప్పటి వరకూ చంద్రబాబు ఉంటాడా..?
97 ఏళ్లు వచ్చిన తర్వాత చంద్రబాబు మనకు విజన్‌ చూపిస్తాడా..?
ఎన్టీఆర్‌ను చంపేసి మళ్లీ తానే దండేసేదే చంద్రబాబు విజన్‌
రజనీకాంత్‌ పనికూడా అయిపోయింది. తమిళనాడులోనే కనీసం చూసే దిక్కులేదు
పార్టీ పెడతానని పారిపోయి వచ్చి ఇక్కడ ఆయనొచ్చి చెప్పేదేముంది..?
తెలుగు ఇండస్ట్రీలో ఎవరూ రారు..అందుకే రజనీకాంత్‌ భాగస్వామి కాబట్టి వచ్చాడు

Back to Top