రాష్ట్రంలో సైకో పాలన ఎప్పుడో పోయింది

మంత్రి జోగి రమేష్‌

అమ‌రావ‌తి:  రాష్ట్రంలో సైకో పాల‌న ఎప్పుడో పోయింద‌ని మంత్రి జోగి ర‌మేష్ అన్నారు. అవినీతి కేసులో అరెస్టై సైకో జైలులో ఉన్నాడ‌ని మంత్రి తెలిపారు. ఇది టీడీపీ ఆఫీసు కాదు. చట్ట సభ. ఇక్కడ జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంద‌న్నారు. అనవసర పదాలు ఉపయోగిస్తే మేము సహించ‌మ‌ని హెచ్చ‌రించారు.  సీఎంను ఉద్దేశించి అసహ్యంగా మాట్లాడితే ఊరుకోం. నోరు అదుపులో పెట్టుకోవాల‌న్నారు.  ఇష్టం వచ్చినట్టు ప్రవరిస్తే ఊరుకునేది లేద‌ని అన్నారు.   కోర్టుల్లో స్టేలతో చంద్రబాబు బతుకుతున్నాడ‌ని  మంత్రి జోగి రమేష్ విమ‌ర్శించారు.
కాగా, సభలో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన ఆగ్రహం వ్య‌క్తం చేశారు. టీడీపీ సభ్యులు ఇప్పటికైనా తమ తీరును మార్చుకోవాలి. కావాలనే సభకు అంతరాయం కలిగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కొన్ని విధానాలుంటాయి. మీ వయసుకు తగ్గట్టు మాట్లాడాల‌న్నారు.

తాజా వీడియోలు

Back to Top