మరో 25 ఏళ్లు వైయస్ జగనే ముఖ్యమంత్రి

మంత్రి జోగి ర‌మేష్‌
 

అమ‌రావ‌తి:  తెలుగు దేశం పార్టీలోనే సంక్షోభం నెల‌కొంద‌ని మంత్రి జోగి ర‌మేష్ అన్నారు.మరో 25 ఏళ్లు వైయస్ జగనే ముఖ్యమంత్రి . సభను అడ్డుకునేందుకు టీడపీ సభ్యులు వస్తున్నార‌ని, సమస్యలపై చర్చించాలన్న ఆలోచన కూడా టీడీపీకి లేద‌న్నారు. సంక్షోభంలో ఉన్న టీడీపీ పార్టీ సభ్యులు   అసెంబ్లీలో గలాటా చేస్తూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ పెట్టండి మా సత్తా చూపిస్తాం అని చెప్పి సభలో మాత్రం గొడవ సృష్టిస్తున్నారన్నారు.  వివిధ సమస్యల పరిష్కారం దిశగా ఎన్ని అంశాలపైన అయినా సరే చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని సీఎం వైయస్ జగన్ చెప్పినప్పుడు ప్రతిపక్షం దానికి ఒప్పుకుని, సమస్యల మీద మాట్లాడతాం అని చెప్పి నేడు సభలో మాత్రం గందరగోళం సృష్టిస్తున్నారన్నారు జోగి రమేష్.  ప్రజాసమస్యలేవీ సభ దృష్టికి తీసుకొచ్చే సత్తా లేక, చర్చకు వచ్చే దమ్ములేక, ఏదో విధంగా బయటకు వెళ్లిపోవాలని టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. 
భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఒక్క బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లోకి సరాసరి రూ.1,70,000 కోట్ల రూపాయిల సంక్షేమ పథకాల సొమ్ము వేసే బృహత్తర కార్యక్రమం ఏ రాష్ట్రంలోనూ లేదని తెలిపారువ. 
సంక్షోభంలో ఉండి, అగమ్యగోచరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్న చంద్రబాబు తన సభ్యులను అసెంబ్లీకి పంపి సభను జరగనీకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.
గతంలో ఒక గ్రామాన్ని తీసుకుంటే ఒక లబ్దిదారుడుకి లోన్ ఇచ్చి మేం ఎంతో చేసామని టీడీపీ చంకలుగుద్దుకునేదన్నారు. 
నేడు సంక్షేమం, అభివృద్ధి అమ్మ ఒడి, చేయూత, ఆసరా, పెన్షన్, విద్యాదీవెన, విద్యాకానుక, రైతుభరోసా వంటి 30 రకాల పథకాల ద్వారా ప్రతి గడపకూ అందుతున్నాయని తెలిపారు. 
ఇది తట్టుకోలేక, ఈ విషయాలన్నీ సభద్వారా ప్రజలకు వెళ్తాయనే భయంతో టీడీపీ, చంద్రబాబు చేస్తున్న కుయుక్తులు పన్నుతూ సభను సజావుగా జరగనివ్వకుండా చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. 
సభా సంప్రదాయాలను పాటించకుండా గలాటా చేస్తూ, స్పీకర్  మీద పేపర్లు విసురుతూ మార్షల్స్ ని పిడిగుద్దులు గుద్దుతూ టీడీపీ సభ్యులు సభలో దిగజారి ప్రవర్తిస్తున్నారన్నారు. 
టీడీపీ ఎన్ని దురాగతాలు చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కుయక్తులు చేసినా, ఎంతమందితో పొత్తులు పెట్టుకుని పొర్లాడాలని చూసినా 25 ఏళ్ల పాటు ఈ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉంటారని స్పష్టం చేశారు మంత్రి జోగి రమేష్.

తాజా వీడియోలు

Back to Top