చంద్రబాబు శిఖండి రాజకీయాలు చేస్తున్నాడు

కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరాం ధ్వజం

కర్నూలు: చంద్రబాబు రాజకీయ చరిత్ర ముగిసిందని, టీడీపీని బీజేపీలో విలీనం చేసి విదేశాలకు పారిపోతాడేమోనన్న అనుమానం కలుగుతుందని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరాం అన్నారు. కర్నూలులో మంత్రి జయరాం మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ అఖండ విజయాన్ని సాధించిందన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని భావిస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు రెండు సంవత్సరాల ప్రతిపక్షంలో కూర్చోలేక చేతులు ఎత్తేసి శిఖండి రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. టీడీపీ రాజకీయ చరిత్ర ముగిసిపోయిందని, చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం ఉంటే ఇంట్లో రెస్ట్‌ తీసుకోవాలని, కనీసం ప్రతిపక్ష నేతగా కూడా బాబు పనికిరాడన్నారు. 
 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top