చంద్రబాబుకు ఊసరవెల్లికి మధ్య తేడా లేదు

కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం

కర్నూలు: చంద్రబాబు నాయుడుకు, ఊసరవెల్లికి ఏ మాత్రం తేడా లేదని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. మేనిఫెస్టో అంటూ చంద్రబాబు మోసకారి మాటలు చెబుతున్నాడని, బాబును నమ్మే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు లేరని చెప్పారు. కర్నూలులో మంత్రి జయరాం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మేనిఫెస్టోలో వాగ్దానాలను 98 శాతం హామీలను పూర్తిచేశాడన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలన చేస్తున్నారని, అక్కచెల్లెమ్మల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. అమ్మ ఒడి కార్యక్రమం పెట్టి నిరుపేద బిడ్డలను చదివిస్తున్నారని, ప్రైవేట్‌ స్కూళ్లతో పోటీపడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చదువుకుంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న పథకాలనే చంద్రబాబు కాపీ కొట్టాడని, 2024లో మరోసారి బాబుకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. మళ్లీ వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి జయరాం చెప్పారు. 
 

Back to Top