రాష్ట్రంలో పారిశ్రామికంగా పుష్కలమైన అవకాశాలు  

జీఐఎస్‌లో మంత్రి గుడివాడ అమర్నాథ్‌

విశాఖ‌:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పారిశ్రామికంగా పుష్క‌ల‌మైన అవ‌కాశాలు ఉన్నాయ‌ని మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ తెలిపారు. విశాఖ‌లో జ‌రుగుతున్న గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్‌లో మంత్రి మాట్లాడారు. ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంద‌న్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ సీఎం వైయ‌స్ జగన్‌ పాలన సాగిస్తున్నార‌ని చెప్పారు. రాష్ట్రంలో సీఎం వైయ‌స్ జగన్‌ సారథ్యంల బలమైన నాయకత్వం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పటిష్టంగా ఉందని మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ చెప్పారు. 

మంత్రి అమర్నాథ్  ఏమన్నారంటే..

అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తున్న విశ్వనగరం విశాఖలో నేడు జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 కార్యక్రమానికి పారిశ్రామికవేత్తలందరికీ సాదరస్వాగతం. ఈ రాష్ట్రంలో పెట్టుబడులకు కల విస్తృత అవకాశాలను నేడు మీకు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మీ అందరి నుండి వచ్చిన స్పందన రాష్ట్రానికి ఎంతో గర్వకారణం. అద్భుతమైన ఎకో సిస్టంతో సీఎం వైయస్ జగన్ గారి నేతృత్వంలో ఏపీ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి సాధిస్తోంది. సంక్షేమ పాలన, నవరత్నాల స్ఫూర్తితో సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి, స్థిరమైన ఆర్థిక వృద్ధిని అందించేలా కృషి జరుగుతోంది. పెట్టుబడిదారులకు రిస్క్ తగ్గించి, తక్కువ ఖర్చుతో బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కు సహకరించేందుకు స్ట్రాంగ్ ఇండస్ట్రియల్ ఎకో సిస్టం అందించేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. స్పష్టమైన పాలసీలు, రాజకీయ స్థిరత్వం కలిగి ఉన్న ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో మీ పెట్టుబడులు, వ్యాపార సుస్థిరతకు ఎంతో భద్రత ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. వ్యాపారవేత్తల అభిమానాన్ని, నమ్మకాన్ని చూరగొని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ 1వ ర్యాంక్ సాధించడమే ఇందుకు నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలకు ఏపీ అద్భుత అవకాశాల దారిని చూపిస్తోంది. బల్క్ డ్రగ్ యూనిట్స్, ఎలక్ట్రానిక్స్ మ్యానిఫాక్చురర్స్, టెక్స్ టైల్స్, భారీ విద్యుత్ ఉత్పాదక సంస్థలు, గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ప్లాంట్స్ మొదలైనవి ఏపీలో అవకాశాలను అందిపుచ్చుకున్నాయి. టెక్నాలజీని అందుపుచ్చుకున్న యువతరాన్ని కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎమర్జింగ్ టెక్నాలజీతో భవిష్యత్ లో రాబోయే ఎన్నో మానవ వనరుల సమస్యలను తొలగించగలదు. లార్జ్ క్లస్టర్స్ ఏర్పాటు ద్వారా పెట్రో కెమికల్ ప్రాసెసింగ్, మెడికల్ ఎక్యూప్మెంట్స్, ఫార్మాసూటికల్ హబ్స్, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ కు అనువుగా ఉంది. స్టాటజిక్ లొకేషన్స్ సహాయంతో వ్యాపార, వాణిజ్య అవసరాలను తీర్చేలా విస్తృతమైన రవాణా సదుపాయాలు దేశవ్యాప్తంగానే కాక, తూర్పు, ఆగ్నేయాసియా సహా పలు అంతర్జాతీయ రవాణాకు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధి లక్ష్యంగా ఈ రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు అవుతున్నాయి. ఒక విజయవంతమైన రాష్ట్రంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఏపీకి ఒక ప్రత్యేక భాగస్వామ్యం ఉందని మేము విశ్వసిస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామిని నిలబెట్టుకునేలా ప్రభుత్వం పనిచేస్తోంది.

Back to Top