రెడ్‌బుక్‌ను ఎక్కడ మడత పెట్టుకుంటావో నీ ఇష్టం లోకేష్‌..

నీ నాలుక మడత తీస్తే కనీసం నాలుగు పదాలైనా పలుకుతావ్‌

లోకేష్‌పై మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సెటైర్లు

విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దెబ్బకు నారా లోకేష్‌ నాలుక, చంద్రబాబు కుర్చీ ఎప్పుడో మడతడిపోయాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. కుర్చీలు కాదు.. లోకేష్‌ నాలుక మడత తీస్తే కనీసం నాలుగు పదాలైన సరిగ్గా పలుకుతాడని ఎద్దేవా చేశారు. విశాఖలో మంత్రి అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడారు. లోకేష్‌ కుర్చీని 2019లో మంగళగిరిలో మడతపెట్టామని, ఇప్పుడు అతని కుర్చీ అతనే మడత బెట్టుకుంటున్నాడన్నారు. మంగళగిరిలో నారా లోకేష్‌ను మరోసారి మడత పెట్టేస్తామన్నారు. రెడ్‌బుక్‌ను ఎక్కడ మడత పెట్టుకుంటావో నీ ఇష్టం లోకేష్‌ అంటూ మంత్రి అమర్‌నాథ్‌ సెటైర్లు వేశారు. నారా లోకేష్‌ ఎంత సీరియస్‌నెస్‌ క్రియేట్‌ చేసినా.. అతని కామెడీ ఫేస్‌ అందుకు సూటవ్వదన్నారు. 
 

Back to Top