శ్రీకాకుళం: నిష్పాక్షితకు నిదర్శనం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శ్రీకూర్మంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. "మూడేళ్ల తరువాత మీ ముందుకు వచ్చాను.పథకాల అందుతున్నాయా లేదా అన్నవి తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చాను. పథకాల అమలుకు సంబంధించి మీరు ఎవ్వరికైనా లంచం ఇచ్చారా ..లేదా మీరు ఫలానా పార్టీకి ఓటు వేయాలని కండీషన్ పెట్టారా అన్నవి కూడా మిమ్మల్ని ప్రశ్నించాను. నిష్పక్షపాతంగా పథకాలు అందుతున్నాయి..అన్నది నిర్వివాదాంశం. అందుకే ఈ ప్రభుత్వం ప్రజలకు చేరువ అయ్యేందుకు పథకాల అమలు అందేలా కృషి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం పోతే ఏమౌతుంది.. వీటి గురించి ఆలోచించాలి. మీరు ఓటేసి ఎంచుకున్న ప్రభుత్వం బట్టే ఇవన్నీ ఆధారపడి ఉంటాయి." "విజ్ఞులైన వారంతా పథకాలకు సంబంధించి, ప్రభుత్వ పనితీరుకు సంబంధించి వివరించేందుకు ప్రయత్నించాలి. కనుక తెలిసిన వారు తెలియని వారికి తెలియజెప్పే ప్రయత్నం ఒకటి తప్పక చేయాలి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయింది..చాలా మంది చదువులేదు.. మంచి ఇల్లు లేదు.. మా బతుకులు ఇంతే అని ఆగిపోతే అది సబబేనా .. ఆ విధంగా నిరుత్సాహ పడిపోతే మంచిదేనా.. అందుకే అలాంటి ఆలోచనలను మార్చేందుకు , జీవన ప్రమాణాలు పెంచేందుకు, భరోసాతో జీవించేందుకు ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. 30 లక్షల ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి గత ఏడాది పంచివ్వడం జరిగింది. " "అదేవిధంగా ప్రతి నెల 2500 రూపాయలు పింఛను ఇస్తున్నాం. ఇది నిజంగానే సంబంధిత అర్హులకు ఓ వరం. ప్రతి నెల ఒకటో తారీఖునే వలంటీరు వచ్చి పింఛను చెల్లించడం అన్నది ఈ ప్రభుత్వ తీరుకు తార్కాణం అని అనిపించడం లేదా అని అడుగుతున్నాను. అదేవిధంగా గతంలో మాదిరి కాకుండా గ్రామ సచివాలయాలు అన్నవి అందుబాటులోకి వచ్చాయి. వాటిని వినియోగించుకోండి.ఒక ఇంటి ఇల్లాలు తన కుటుంబాన్ని మెరుగు చేయగలదు.. అభివృద్ధి చేయగలదు..అని చెప్పేందుకే పథకాలన్నీ ఆడబిడ్డల పేరున అందిస్తూ., కుటుంబాలను నిలిపే ప్రయత్నం ఒకటి చేస్తున్నాం. మీరంతా జగన్ కు బాసటగా నిలవాలి.. మంచి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలి. మన జీవితాలను మార్చి సమున్నత మార్పు తీసుకువస్తున్న జగన్ ప్రభుత్వానికి అండగా ఉండాలని..." అని అన్నారు ఎంపిపి గోండు రఘురాం, వైస్ ఎంపిపి బరాటం రామశేషు, సర్పంచ్ గోరు అనిత, వైస్సార్సీపీ నాయకులు గోండు కృష్ణ, ముంజేటి కృష్ణ, బరాటం నాగేశ్వరరావు, మార్పు పృథ్వి, సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.