ఐదున్నర సంవత్సరాల ముందు మీ ముందుకు వచ్చాం. ఆనాడు ఉన్న పరిపాలనలో ఉన్న అవినీతినీ,దోపిడీనీ నిర్ల్యక్షాన్నీ వివరించడం జరిగింది. మళ్లీ ఇప్పుడు మీ ముందుకు వచ్చాం. పరిపాలనలో ఉన్న ముఖ్యాంశాలను మీకు వివరించేందుకు మీ ముందుకు వచ్చాం. చిన్న,చిన్న మార్పులకు కూడా పెద్ద పెద్ద ఉద్యమాలు చేయాల్సి వచ్చేది. గతంలో ఇదే విధంగా ఉండేది. కానీ ఇందుకు భిన్నంగా నాలుగున్నరేళ్లుగా పాలన సాగింది. ఓ మంచి నీటి పథకం కిడ్నీ రోగులకు అందించడం జరిగింది. ఆ రోజు అనేక మంది చూసి వెళ్లేవారు,వారి పై దయ కనబరిచేవారు. కానీ మీరు ఎంచుకున్న ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ఉంది. ఓ సమస్య ఉంటే ఆ సమస్య కారణాలను గుర్తించి పరిష్కారానికి ఎంతో కృషి చేస్తుంది. కిడ్నీ రోగులకు సంబంధించి వీళ్లంతా భూగర్భ జలాలు తాగి వ్యాధి బారిన పడుతున్నారన్న విషయాన్ని గుర్తించి,హిరమండలం నుంచి నీరు ఇక్కడికి తెచ్చి ఉద్దానం ప్రాంతం అంతా అలానే నీరు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. పూర్వం ఏదో ఒక కార్యక్రమం చేపట్టదలుచుకుంటే ఆ కార్యక్రమం మూడు,నాలుగు ప్రభుత్వాలు మారితే కానీ పూర్తయ్యేది కాదు. "ఈనాడు ఈ ప్రాంతంలో ఓ ఆస్పత్రికి ఈ ప్రభుత్వం పునాది రాయి వేస్తే, ఈ ప్రభుత్వ హయాంలో ఉపరితల జలాలు ఇవ్వాలన్న ఆలోచనకు వస్తే ఆ రెండూ ఇప్పుడు ప్రారంభానికి సిద్ధం గా ఉన్నాయి. ఈ నెల 23న మన జిల్లాలో పలాస ప్రాంతానికి ముఖ్యమం త్రి జగన్ వచ్చి ఆ నాడు పునాది రాయి వేసిన ఆస్పత్రి ప్రారంభానికి పూనుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ను. పరిపాలన అంటే ఓ కొత్త ఒరవడి తీసుకు వచ్చారు ఈ రాష్ట్రంలో.. మనదంతా ఉద్యమాలకు పురిటిగడ్డ లాంటిది ఈ ప్రాంతం. అనేక ఉద్యమాలు చేస్తే కానీ సమస్యలు పరిష్కారం అయ్యేవి కావు. ఏ ఉద్యమం లేకుండా ఈ రాష్ట్రంలో అనేక విషయాలపై సమూలంగా మార్పులు తీసుకు వచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది. ముఖ్యంగా దిగువ స్థాయిలో అవినీతి లేదు. ఒకనాడు ఈ దేశంలో అవినీతి అన్నది వదిలేటటు వంటి జాడ్యం కాదు.. కేంద్రం నుంచి,రాష్ట్రం నుంచి వచ్చిన నిధులలో తొంభై శాతం వరకూ పక్కదోవ పట్టిన దాఖలాలు ఉండేవి..అని భావిస్తున్న తరుణంలో, మధ్య వర్తులకు లంచాల రూపంలో, కమిషన్ల రూపంలో ఇవ్వాల్సి వస్తుందని బాధపడినటువంటి ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు ఉన్నారు. అలాంటివేవీ లేకుండా రెండు లక్షల 30 వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని సంక్షేమ పథకాలకు అందించిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ఎక్కడ ఒక్క ఆరోపణ ప్రజల కాదు ప్రతిపక్షాలు కాదు పత్రికలు కాదు ఏ ఒక్కరూ చేయలేకపోయారు. చంద్రబాబు కూడా చెప్పలేకపోయారు. వీటిపై విమర్శలు చేయలేరు. ఇవి మీ కార్యకర్తల జేబుల్లోకి వెళ్లిందని చంద్రబాబు కూడా ఆరోపణల చేయలేకపోయారు. చంద్రబా బుకు చెబుతున్నాను..మీరు ఆ విధంగా అనలేని విధంగా ఉందంటే పరిపాలన లో ఇవాళ వచ్చి న మార్పు ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవాలి అని విన్నవిస్తూ ఉన్నాను. అలానే అనేక విషయాలలో పరిపాలనలో ఇవాళ గొప్ప గొప్ప మార్పులు వచ్చాయి. పరిపాలన మొదలయ్యే ముందు ఒక్క సంవత్సరంలో కొట్టి పారేద్దాం అని అనుకున్నారు. ప్రభుత్వాన్ని లేకుండా చేసేద్దాం అని అనుకున్నారు. బీదలకు డబ్బు దుర్వినియోగం చేస్తున్నాం అని చంద్రబాబు అని అన్నారు. రాష్ట్రం నాశనం అయిపోతుంది అని అన్నారు. కానీ ఇదే పెద్ద మనిషి మేం అధికారంలోకి వస్తే.. మీకంటే ఎక్కువ డబ్బులు పంచుతాం అంటున్నారు. అంటే ఆ రోజు మనం అమలు చేస్తున్న కార్యక్రమం తాలుకా లోతులను ఆయన పరిశీలించలేకపోయారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలన్న ది జగన్ తపన. ఒక ఐదేళ్లలో పాలన కారణంగా జీవన ప్రమాణాలు పెంచగలిగాం అన్నది ముఖ్యం. చంద్రబాబు దృష్టి ధనవంతుల పై ఉంది. దోపిడీదారులపై ఉంది. ఇవాళ ప్రభుత్వం తీసుకు వచ్చిన మార్పులు ఓట్లు కోసం కాదు. బీద వర్గాల కోసం వారి చదువుల కోసం చేస్తున్న ప్రయత్నం అది ఓట్లు కోసం చేస్తున్నదా ? అన్ని వర్గాల ఉన్నతికి వారి జీవ న ప్రమాణాల పెంపుదలకు, అలానే వివిధ వర్గాల అసమానతలు తొలగించాలన్నది ఈ ప్రభుత్వం ఉద్దేశం. మీ అందరూ అనేక విష యాల కోసం యుద్ధాలు చేశారు. పోరాటాలు చేశారు. కానీ మీరు ఏమీ కోరకుండానే యుద్ధాలు చేయకుండానే పోరాటాలు చేయకుండానే మీరు ఒక్క మాట కూడా మాట్లాడకుండానే అనేక విషయాల్లో మార్పులు తీసుకు వచ్చాం. మీరు ప్రాణ త్యాగాలు చేయకుండానే ఇవన్నీ సాధ్యం అయ్యాయి. రాష్ట్రంలో ఉన్న లెఫ్ట్ ఓరియెంటెడ్ పార్టీల మిత్రులకు విన్నవిస్తున్నాను. ఇది ఆదర్శ వంతం అయిన పాలన. దేశంలో ఇతర రాష్ట్రాలు అనుసరించాల్సిన పరిపాలన అని ఈ సందర్భంగా విన్నవిస్తున్నాను. చాలా మంది చెబుతూ ఉంటారు రోడ్డు వేయలేదని,ఆ రోడ్డే అభివృద్ధికి మార్గమని చెబుతూ ఉంటారు. నిజానికి రోడ్డేనా అభివృద్ధికి మార్గమా ? అభివృద్ధికి రోడ్డు ఓ సూచిక కావొచ్చు. ఓ మార్గం కావొచ్చు. నిజమయిన అభివృద్ధి ఏంటంటే ఆరోగ్యం గా ఉండడం. ఒక కుటుంబం విద్యావంతులుగా ఉండడం. ఒక కుటుంబం నివాస యోగ్యమయిన ఇల్లు కలిగి ఉండడం,ఒక కుటుంబం పరిశుభ్ర మయిన వాతావరణం కలిగి ఉండడం. అన్నీ కలిసి జీవన ప్రమాణాలు సూచిస్తాయి. జీవన ప్రమాణాలే అభివృద్ధి సూచీలుగా ఉంటాయి. ఎక్కడో ఓ ఇరవై ఐదు అంతస్తుల బిల్డింగు కట్టి ఆ భవంతిని చూపి ఈ రాష్ట్రంలో ఉన్న పేదలంతా బతకమంటే బతికేయగలరా ? దాని వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఓ పద్ధతి ప్రకారం జరుగుతున్న చెడ్డ ప్రచారం ఏంటంటే..రోడ్లు లేవు అని, అందువల్ల ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని కొందరు అదే పనిగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్టు కాదు. ఒక్క రోడ్లూ బిల్డింగులే కావు. ఇంతకుముందు నేను చెప్పినటువంటి విషయాలు అత్యంత ప్రాధాన్యాలు. ఈసురోమంటూ ఓ కుటుంబం ఉంటే అది అభివృద్ధి కాదు. విద్య లేకుండా నిరక్ష్యరాస్యులుగా ఉండి, భవిష్యత్ పై ఆశలేకుండా జీవించడం అభివృద్ధి చెందిన సమాజానికి నిదర్శనమా కాదు కదా ..ఓ ఇల్లు లేకుండా, స్వాతంత్ర్యం వచ్చి డబ్బై ఐదేళ్లు అయినా ఉండేందుకు నిలువ లేకుండా ఉండడం అభివృద్ధికి నిదర్శనమా కాదు కదా..ఇవన్నీ పద్నాగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు తెలియవా ? తెలియవనే చెప్పాలి. లేదా కాకపోతే వీటిపై ఆసక్తి లేదనే చెప్పాలి. కాకపోతే ఈ ప్రజలను ఆయన మోసగించారనే చెప్పాలి. ఈ రాష్ట్రం ఏర్పడిన వెంటనే రాజధాని అంటూ తన వారికి లబ్ధి చేకూర్చే విధంగా తపన పడ్డారు. ఎవ్వరికీ తెలియకుండా తన వారికి భూములు దక్కే విధంగా ఆయన ఆరాటపడ్డారు. రాజధాని పేరిట ప్రకటనలు చేసి తన వారికి లబ్ధి చేసే విధంగా భూములు వారికి కట్టబెట్టే విధంగా చేశారు. సంబంధిత ప్రాంతం చుట్టూ తన వారితో భూములు కొనుగోలు చేయించారు. రాజధాని ఎక్కడ పెట్టాలి ? అన్నవిషయమై ఎవ్వరికీ తెలియకుండా తనకు కావాల్సిన వారికి లబ్ధి చేకూర్చే విధంగా ఆయన ఆ రోజు ఆరాట పడ్డారు. అన్ని ప్రాంతాలూ అన్ని వర్గాలూ ఆనందంగా ఉండేందుకు నేను పనిచేస్తానని ఆయన ఏనాడూ అనలేదు. ఆ రోజు కేంద్రం విభజిత రాష్ట్రానికి విభజన కారణంగా 2014లో నష్ట పోయిన రాష్ట్రానికి 23 సంస్థలను పరిహారం కింద కేటాయించింది. అందులో ఒక్కటంటే ఒక్క సంస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేదు. మన జిల్లాలో ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థను కూడా ఆయన ఏర్పాటు చేయలేదు. ఇదీ ఆయనకు ఈ ప్రాంతం అంటే ఉన్న ప్రేమ ? ఆ రోజు శ్రీకాకుళం కు వాటా కింద కనీసం రెండు సంస్థలు రావాలి. కానీ అవి రాలేదు. రీసెర్చ్ సెంటర్లు కానీ యూనివర్శిటీలు కానీ ఏర్పాటు కావాలి. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేదు. ఈ ప్రాంతం అంటే మీకు ప్రేమ ఉందా ? ఉద్దానం ప్రాంతానికి నీరు తెచ్చారా ? ఎప్పుడూ మిమ్మల్నే గెలిపిస్తున్నారు ఇక్కడి ప్రాంత ప్రజలు. వారి కోసం మీరు ఏం చేశారని ప్రశ్నిస్తూ ఉన్నాను. 1985 తరువాత చాలా కాలం గెలిపించారు. ఓ ఆస్పత్రి పెట్టారా ? ఒక సంస్థ సరైంది పెట్టారా ? మీరు ఆలోచించి మీరు నెలకొల్పిన సంస్థ ఒక్కటైనా ఉందా ? ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తున్న వారెవ్వ రయినా మేం ఫలానా పని ప్రజల కోసం చేశామని చెప్పగలరా ? ప్రజా స్వామ్య దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలన్నా వారి కోసం ఆలోచించే వారు నాయకులు కావాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆలోచిస్తున్నాం అని అంటున్నారు. ఇప్పుడు ప్రారంభిస్తాం అని అంటున్నారు. మీకు డబ్బై ఏళ్లు వచ్చాక ఆలోచన చేస్తున్నారా ? మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇవన్నీ ఆలోచించలేదా ? ఈ ప్రాంత ప్రజలపై నమ్మకం ఉంది. ఇదంతా ఉద్యమ కారులున్న ప్రాంతం. పలాస ప్రాంత ప్రజలకు విన్నవిస్తు న్నదేంటంటే.. అట్టడుగు వర్గానికి చెందిన వ్యక్తి మంత్రిగా నియమితులై బాగా పని చేయగలుగుతున్నారు. ఇలాంటి ప్రతినిధిని నిలబెట్టుకోవాల్సి ఉంది. (మంత్రి సీదిరిని ఉద్దేశిస్తూ). ఇలాంటి స్థిరమయిన ఆలోచనతో ఉన్న నాయకత్వాలు కావాలి. మన ప్రాంతం పై జగన్ ప్రేమను కలిగి ఉన్నారు. ముఖ్య మంత్రి చొరవతో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో మూలపేటకు పోర్టు వచ్చింది. ఒక ప్రభుత్వం ఒక ప్రాజెక్టును ఇన్ని వేల కోట్లతో శ్రీకాకుళం జిల్లాకు ఇచ్చిన సందర్భం గతంలో ఎన్నడూ లేదు. పోర్టు వస్తే ఈ ప్రాంతం ప్రపంచంతో కనెక్టివిటీ పెంచుకుంటుంది. పోర్టు వస్తే ఇక్కడే మెరైన్ షిప్ లో పని చేసుకునే అవకాశం వస్తుంది. దీనికి అనుబంధంగా పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన అన్నవి రానున్నాయి. ఈ ప్రభుత్వం పై చంద్రబాబు ఏమీ అనలేకపోతున్నారు. అర్థం లేని మాటలు అంటున్నారు. పథకాల అమలుపై ఆయన ఏమీ మాట్లాడలేకపోతున్నారు. చిన్న చిన్న విభేదాలు పక్కనబెట్టి ఎన్నికలు వచ్చే వేళ జగన్ నాయకత్వాన్ని నిలబెట్టా లని కోరుతున్నాను. కుట్ర పూరితంగా చంద్రబాబు మీ ముందుకు వస్తున్నారు. వాటిని మీరు తిప్పి కొట్టాలి. మీరు మీ తోటి వారికి నేను చెప్పిన మంచి విషయాలు చెప్పండి. ఆఖరి నిమిషంలో యువత మంచి పాత్ర పోషించాలి. ఎలాంటి నిర్ణయం తీసుకో వాలి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మన ప్రాం