స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌తో గ్రామాల చెంతకే ప‌రిపాల‌న  

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ధర్మాన
 
గొంటిలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన  గ్రామ స‌చివాల‌యం ప్రారంభం

చంద్ర‌బాబుది అస‌త్య ప్ర‌చారం న‌మ్మ‌కండి 

రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్రసాదరావు 

శ్రీ‌కాకుళం:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమ‌లు చేసిన స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌తో గ్రామాల చెంత‌కే ప‌రిపాల‌న వ‌చ్చింద‌ని రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు తెలిపారు.  సంక్షేమం, అభివృద్ధి అన్న‌వి స‌మ ప్రాధాన్యాలుగా ప‌రిపాల‌న చేస్తున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ ప్ర‌భుత్వం గ్రామ స‌చివాల‌య వ్య‌వస్థ‌తో ప్ర‌జా జీవితాల‌లో అనూహ్య మార్పులు తీసుకువ‌చ్చింద‌ని తెలిపారు. గార మండ‌లంలో న‌ల‌భై ల‌క్ష‌ల రూపాయ‌ల నిధుల‌తో నిర్మించిన గొంటి గ్రామ స‌చివాల‌యాన్ని మంత్రి ధ‌ర్మాన‌ ప్రారంభించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మాట్లాడుతూ.."మీ సచివాలయం పరిధిలో గ‌డిచిన నాలుగేళ్ల‌లో జ‌రిగిన అభివృద్ధి చూడండి. అమ‌లుకు నోచుకున్న సంక్షేమం గురించి మ‌రోసారి గుర్తు చేసుకోండి. పాల‌న‌కు సంబంధించి మీ అభిప్రాయాల‌ను తెలుసుకునేందుకు ఇక్క‌డికి వ‌చ్చాం. ఇంకా స‌మ‌ర్థ రీతిలో ప‌నిచేసేందుకు గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం అనే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నాం. పాల‌న‌లో మార్పులు కార‌ణంగా  గ్రామ స‌చివాల‌యాలు వ‌చ్చేయి. వీటి కార‌ణంగా గ్రామానికి చెందిన పరిపాలన అంతా సచివాలయంలోనే జరగనుంది. మండల హెడ్ క్వార్టర్ కి వెళ్లాల్సిన పని లేదు. 

లంచాలు లేకుండా మీ పనులు జరుగుతున్నాయి. ఇందుకు కారణం మీరు ఓటు వేసి గెలిపించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్లనే సాధ్యం అయ్యింది అని విన్న‌విస్తూ ఉన్నాను. ప్రజలు ఊళ్లో ఎవరి దగ్గరా మోక‌రిల్లాల్సిన పని లేకుండా నిష్పక్షపాతంగా పథకాలు అందిస్తున్నాం. వంద ఏళ్ల త‌రువాత భూస‌ర్వే చేయిస్తున్నాం. బ్రిటీష్ వారి హ‌యాంలో చేసిన స‌ర్వే త‌రువాత మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు స‌మ‌గ్ర రీతిలో భూ స‌ర్వే చేయించ‌గ‌లుగుతున్నాం. గ్రామాల్లో త‌గాదాల‌లో ఎక్కువ‌గా భూమికి సంబంధించే ఉంటాయి. వీటిని ప‌రిష్క‌రించుకోలేక ఏళ్ల త‌ర‌బ‌డి అవ‌స్థ‌లు ప‌డుతున్న వారు ఉన్నారు. ఆ విధంగా కాకుండా భూమి విస్తారంగా వినియోగంలోకి వ‌చ్చే విధంగా ఈ ప్ర‌భుత్వం చేప‌డుతున్న చ‌ర్య‌లు ఫ‌లిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆధునిక సాంకేతిక‌త‌ను వినియోగిస్తూ.. చేయిస్తున్న స‌ర్వే కానీ త‌ద‌నంత‌రం  హ‌ద్దులు నిర్ణ‌యిస్తూ రాళ్లు పాతించ‌డం కానీ చేస్తున్నాం. వీటి కార‌ణంగా వివాదాలన్న‌వి స‌త్వ‌ర ప‌రిష్కారానికి నోచుకోనున్నాయి. ఊళ్ల‌లో నెల‌కొన్న తగాదాలు, అశాంతి పోవాలంటే భూమి హద్దులు సారిగా ఉండాలని భూ సర్వే చేపట్టాం.సర్వే చేసి,హద్దు రాళ్ళు వేసి, రికార్డ్స్ కూడా ప్రభుత్వం అందిస్తుంది. 

ఇకపై స‌చివాల‌యాల్లోనే భూ రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ కూడా అందుబాటులోకి రానుంది. ఇన్ని మార్పులు నాలుగేళ్ల క్రితం మీరు ఓటు వేసి గెలిపించిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వం వల్లనే సాధ్యం అయ్యింది. ఓటు వేసినా, వెయ్యకపొయినా, మా పార్టీ అయినా, కాకపోయి నా, రేపు ఎన్నికల్లో ఓటు వేస్తారా, వెయ్యరా అని చూడడం లేదు. కేవలం పేదరికాన్ని అర్హ‌తగా ప‌రిగ‌ణించి పథకాలు అందిస్తున్నాం. ఒక‌ప్పుడు టీడీపీ హయాంలో ఒక పథకం అందాలి అంటే, జన్మ భూమి కమిటీ సభ్యులకు స‌లాం కొట్టాల్సి వ‌చ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్తితి పూర్తిగా తుడిచేశాం. వివిధ ప‌థ‌కాల ద్వారా 2.2 లక్షల కోట్ల రూపాయ‌లను నేరుగా లబ్ధిదారులకు మధ్యవర్తులు లేకుండా అందించాము. 

మీకు ఇంత మంచి పని చేస్తుంటే,విప‌క్ష నేత చంద్రబాబు మేం ప్ర‌జాధ‌నం దుర్వినియోగం చేస్తున్నాం అంటున్నారు. అంటే మీకు అమ్మ ఒడి ప‌థ‌కం అమ‌లులో భాగంగా న‌గదు వేస్తే తప్పా? చేయూత అందిస్తే తప్పా ? పెన్షన్ అందిస్తే తప్పా ? మీ భూమిని సర్వే చేసి ఇస్తే తప్పా ? ఏది త‌ప్పు ? ప్రజలు ఇవ‌న్నీ తెలుసుకోవాలి. ఎవ‌రు మంచి చేస్తున్నారో.. అన్న‌ది గుర్తించాలి. సమాజంలో ఉంటున్న పేద వర్గాలు రాజ్యాంగంలో పొందు పరిచినట్లుగా, పథకాలు అందిస్తుంటే  ప్రజాధనం దుర్వినియోగం అంటారా ? అభివృద్ధి ఫలాలు అన్న‌వి అర్హ‌త ఉన్న ప్రజలంతా అందుకోవాలి. 

ఎయిర్ పోర్ట్ కడితే అభివృద్ధి కాదు, ఆ ఎయిర్ పోర్ట్ కికి సామాన్యుడు వెళ్ళే స్థితి వచ్చిన నాడే అభివృద్ధి. అదే సీఎం జగన్ చేస్తున్నారు. మీ అందరి స్థితి గతులు పెంచుతున్నారు. జీవ‌న ప్ర‌మాణాలు మెరుగు ప‌రుస్తున్నారు. శ్రీకాకుళం నియోజవర్గం లో 20 వేల మందికి,రూ. 500 కోట్లు వెచ్చించి భూమి కొని పట్టాలు ఇచ్చాము. విప‌క్ష నేత చంద్రబాబు, ఏనాడైనా సెంటు భూమి పేద వారి కోసం కొన్నరా..? అని ప్ర‌శ్నిస్తున్నాను.  ఆనాడు చంద్రబాబు పరిపాలన అంతా బ్రోక‌ర్లమ‌యం. త‌మ సమస్యలు చెప్పుకునేందుకు నాటి ముఖ్య‌మంత్రి త‌చంద్రబాబు దగ్గరకు నాయీ బ్రాహ్మ‌ణులు వెళ్తే తోక కట్ చేస్తా అని బెదిరించారు. అదే జగన్ మోహన్ రెడ్డి పాల‌న‌లో ఆలయాలలో ఒక పాలక సభ్యునిగా అవ‌కాశం ఇస్తూ, వారికి ఇస్తున్న గౌరవ వేతనం పెంచారు. మీరు ఓటు వేసి గెలిపించిన వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం మరొక్క ఏడాది ఉంటుంది. మీ అందరూ మరొక్కసారి ఈ ప్ర‌భుత్వానికి అండగా ఉండాలి. గతంలో ఏ స‌మ‌స్య ఉన్నా మండ‌ల కేంద్రం అయిన గార బయలుదేరి వెళ్లే వాళ్ళం. 

కానీ ఇప్పుడు నేరుగా మీ సచివాలయంలోనే అన్ని స‌మ‌స్య‌లూ ప‌రిష్కారం అవుతాయి. అదేవిధంగా ఒక‌ప్పుడు ఒకే భూమిపై రెండు, మూడు రిజిస్ట్రేష‌న్లు జ‌రిగేవి. కానీ ఇప్పుడు ఆ విధంగా జ‌రిగేందుకు వీల్లేదు. ఇందుకు సంబంధించి పాల‌న‌ప‌రం అయిన మార్పుల‌ను క్షేత్ర స్థాయిలో తీసుకు వ‌చ్చాం. ఒక‌ప్పుడు భూ త‌గాదాల కార‌ణంగా గ్రామంలో బ‌లహీనులుగా ఉండే వారి ప‌రిస్థితి దారుణంగా ఉండేది. కానీ పాల‌న ప‌రం అయిన మార్పులు చేసేందుకు నాలుగేళ్లు పట్టింది. ఇవాళ పెన్ష‌న్ల పంపిణీలో ఎవ్వ‌రైనా మొన్న‌టి ఎన్నిక‌ల్లో మీరు వైయ‌స్ఆర్‌సీపీకి ఓటు వేశారా అని అడిగారా  ? అదే తెలుగుదేశం పార్టీ హ‌యాంలో పెన్ష‌న్లు కానీ ఇత‌ర ప‌థ‌కాల ల‌బ్ధిని అందించేట‌ప్పుడు మీరు మా పార్టీలోకి వ‌స్తేనే ప‌నులు చేస్తాం అని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ విధంగా ప‌రిస్థితులు లేవు. మధ్యవరుతులు లేకుండా మీకు పధకాలు అందిస్తే చంద్రబాబు ఖర్చు అంటాడు. నిష్ప‌క్ష‌పాత ధోర‌ణిలో భాగంగా ప్రజలకు పథ‌కాలు ఇస్తుంటే చంద్రబాబు తప్పు అంటారు. మీరే చెప్పండి తప్పా ఈ ప్రభుత్వం చేసింది ? 2024 లో వైఎస్సార్ కాంగ్రెస్ కు కాకుండా మీరో పార్టీకి ఓటు వేస్తే ఒకటో తేదీకి మీ వ‌లంటరీ మరి రాడు. గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వం అస‌మ‌ర్థ రీతిలో పాల‌న చేసింది. పేద‌ల కోసం ఒక్క‌టంటే ఒక్క సెంటు భూమి కూడా కొనుగోలు చేయ‌లేక‌పోయింది. 

మా  పరిపాలన బాగోలేదు అంటే ఏం బాగాలేదో చెప్పండి. దోపిడీ చేసే ప్రభుత్వం బాగుంది కదా ? ఇన్ని ప‌థ‌కాలు రానున్న కాలంలో అమ‌లు  కావాలంటే ఎవ‌రు రావాలో ఎవ‌రు వ‌స్తే బాగుంటుందో అన్న‌ది ఆలోచ‌న చేయండి. ఇక గ్రామంలో నెల‌కొన్న తాగునీటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు రూ.1.3 కోట్లతో గ్రామంలో ఇంటి ఇంటికి మంచి నీరు త్వరలో అందిస్తాం  " అని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.

వైయ‌స్ఆర్‌సీపీ యువ‌ నాయ‌కులు ధ‌ర్మాన రామ్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ.. ఇంటింటికీ వెళ్ళినప్పుడు ప్రజల స్పందన చూస్తే ఆనందం క‌లుగుతోంది. విశాల భావజాలం కలిగిన సీఎం వైయ‌స్ జగన్ ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నారు. ఈ ప్ర‌భుత్వం సుమారు రూ.14 కోట్ల రూపాయ‌ల‌ను గొంటి గ్రామ వాసుల సంక్షేమానికే వెచ్చించింది. దీపావళి నుంచి గొంటి వ‌ర‌కూ సుమారు కోటి ఖ‌ర్చు చేశాము. నాడు - నేడు ద్వారా గ్రామంలో ఉన్న స్కూల్ కి 45 లక్షల రూపాయ‌లు ఖ‌ర్చు చేశాము.  " అని చెప్పారు.

ఎంపీపీ గొండు రఘురాం, డీసీఎంఎస్ మాజీ అధ్యక్షులు గొండు కృష్ణమూర్తి ,  శిమ్మ ధర్మ రాజు, ఎంపీటీసీ కోట రామారావు, పీసా గోపి, శ్రీహరి రావు, వైస్ ఎంపీపీ లు అరవల  రామకృష్ణ, అందవ రపు బాలకృష్ణ  మూర్తి, జయరాం యాల్ల నారాయణమూర్తి, కొయ్యానా నాగభూషణ, ముంజేటి కృష్ణ, మార్పు పృథ్వి,  తహశేలదీర్  జె రామ రావు, ఎంపీడీఓ శిమ్మ రామ్ మనోహర్, తదితరులు పాల్గొన్నారు

Back to Top