అంద‌రూ క‌లిసి ఒకే గొంతు వినిపిద్దాం

 రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు 

 గ్రామ స‌చివాల‌య ప‌రిధిలో ప‌నుల‌కు రూ.20 ల‌క్ష‌లు మంజూరు 

శ్రీ‌కాకుళం : విశాఖ రాజ‌ధాని సాధ‌న విష‌య‌మై అంద‌రూ క‌లిసి గొంతు వినిపించాల్సిన బాధ్య‌త ఉంద‌ని రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. స్థానిక హెడ్ పోస్టాఫీసు వీధికి ఆనుకుని ఉన్న స‌చివాల‌య ప‌రిధిలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక స‌మ‌స్య‌లు గుర్తించారు. వాటి పరిష్కారానికి నిధులు విడుద‌ల చేస్తామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా  ఆయన మాట్లాడుతూ.. విశాఖే రాజ‌ధాని అన్న నినాదం సాకారం కోసం అంతా క‌లిసి  క‌ట్టుగా ప‌నిచేయాల‌ని, అందుకు త‌గ్గ విధంగా ఉద్య‌మించాల‌ని చెప్పారు. అంతా క‌లిసి రాజ‌ధాని నిర్ణ‌యాన్ని స్వాగతిస్తూ, పెద్ద ఎత్తున ఉద్య‌మాలు చేప‌ట్టి మాట్లాడ‌గ‌లిగిన‌ప్పుడే మ‌న క‌ల‌ల సాధ‌న అన్న‌ది సాకారం అవుతుంద‌ని, ఇందుకు సాధ‌న వీరులంతా క‌లిసి మున్ముందుకు అడుగులు వేయాల‌ని చెప్పారు. అదేవిధంగా ఒక‌నాడు రాజ‌ధాని గా క‌ర్నూలు, అంత‌కుమునుపు మ‌ద్రాసు ప‌ట్ట‌ణం, ఆ త‌రువాత మారిన ప‌రిణామాల నేప‌థ్యంలో  ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం ఏర్పాట‌య్యాక  హైద్రాబాద్ ఈ విధంగా చాలా ఇబ్బందులు పడ్డామ‌ని, కానీ ఇప్పుడు మ‌న చెంత‌కే రాజ‌ధాని వ‌స్తుంది క‌నుక ఈ అవ‌కాశాన్ని అస్స‌లు వ‌దులు కోవ‌ద్ద‌ని పిలుపునిచ్చారు. 

ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం అభివృద్ధిలో భాగమే. 
బ్రిటీషేర్స్ ఆనాడు సర్వే చేశారు, మళ్ళీ 100 ఏళ్ల తర్వాత ఇపుడు మన ప్రభుత్వం చేస్తుంది, తన ఆస్తిని తాను సులువుగా రుజువు చేసుకునే అవ‌కాశం ప్ర‌భుత్వం క‌ల్పించాలి. వీటి కార‌ణంగా అనేక త‌గాదాలు వ‌స్తున్నాయి. భూ స‌మ‌స్య‌ల కార‌ణంగా ఇవ‌న్నీ వ‌స్తున్నాయి. భూ హ‌ద్దులు నిర్ణ‌యం అయితే ఇక పై త‌గాదాలు త‌గ్గుతాయి. శాంతి సామర‌స్యాలు మ‌రింత పెరుగుతాయి. నిరంత‌రం తీవ్ర‌మ‌యిన గొడ‌వ‌ల‌తో న‌లిగిపోవ‌డం అన్నది గ‌తంలో ఉండేది. కానీ ఇప్పుడు స‌ర్వే పూర్తయితే అటువంటివేవీ జ‌ర‌గ‌వు. రిజిస్ట్రేషన్ లో కూడా మార్పులు చేపడుతున్నాము, సచివాలయాలలోనే ఇక మీదట రిజిస్ట్రేషన్ జరుపుకునే వెసులుబాటు కలిపిస్తాం.

15000 కోట్లు పెడితే చాలా వైజాగ్ ని రాజధానిగా తీర్చిదిదోచ్చు. మన ప్రాంతానికి కన్నీటి తుడవడానికి అవకాశం వచ్చింది. వ్యతిరేకించిన వారు ద్రోహులే. ప్రజాస్వామ్యంలో గొంతు ఎత్తి మాట్లాడితే సాధించ‌గ‌లం. ఆ దిశ‌గా అడుగులు వేయాలి అంద‌రం. మ‌నంద‌రి ల‌క్ష్యం ఒక‌టే కావాలి రాజ‌ధాని ఏర్పాటుతో మన ప్రాంత ప్రజల జీవ‌న ప్ర‌మాణాలు పెరగాలి. అందుబాటులోకి  అవ‌కాశాలు వ‌స్తే వ‌ల‌సల నివార‌ణ అన్న‌ది సాధ్యం.  రాజధాని వైజాగ్  కు వస్తే మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వలసలు తగ్గుతాయి. అందుకే వైజాగ్ మన ప్రాంత హక్కు.అది లాక్కోకుండా ప్రతి ఒక్కరూ గొంతెత్తాలి.

కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేశు, మాజీ మున్సిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతీ, సాధు వైకుంఠ రావు, శిమ్మ రాజశేఖర్, చల్లా శ్రీనివాసరావు, కొనర్క్ శ్రీనివాసరావు, మండవిల్లి రవి, డాక్టర్ పైడి మహేశ్వర రావు, ఖాన్, అంధవరపు సంతోష్, సీజు, బైరి మురళి, అంధవరపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top