నిరాశ, నిస్పృహాతో ఉన్న వర్గాలకు వైయ‌స్ఆర్‌ సీపీ ఓ కాంతిరేఖ..వెలుగు చుక్క‌

మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు
 

అమ‌రావ‌తి: డబ్బై సంవత్సరాలుగా నిరాశ, నిస్పృహాతో ఉన్న వర్గాలకు వైయ‌స్ఆర్‌ సీపీ ఓ కాంతిరేఖగా, వెలుగు చుక్కగా ఉందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మన ప్రసాద్‌ రావు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ… బలహీనులు, అట్టడుగు‌ కులాల కోరికలు తీర్చడం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని, ఎవరికీ తలవంచకుండా, ఎవరికీ లంచం ఇవ్వకుండా సంక్షేమ పథకాలను ఇంటి వద్దే పొందుతున్నారన్నారు. చంద్రబాబు పెన్షన్‌ ఇచ్చాడు. జెండా పెట్టాలి, పసుపు చొక్కా వెయ్యాలి, లేదా దేవుడి మీద ఒట్టు వేయాలి అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఆయారాం గయారం ప్రభుత్వం కాదు.. ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం, ఆశయం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది అని ఆయన వెల్లడించారు. డబ్బులు పంచేస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారని, అధికారంలోకి వస్తే ఆపేస్తావా‌… ఏం చేస్తావో చెప్పాలన్నారు.

సామాన్యులకు డబ్బులు ఇవ్వడం ఇష్టంలేని వర్గాలు, మింగటానికి లేదని బాధపడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రయోజనం పొందుతున్న పేదవారు ఒక్క నయాపైసా అవినీతి జరగటం లేదని ఆయన వెల్లడించారు. బాదుడే బాదుడు అని తిరుగుతున్న చంద్రబాబు‌ కూడా లంచం తీసుకున్నడని అనలేడని, ఆర్థిక కష్టాలలో‌ కూడా తిత్లీ ఎమౌంట్ వేస్తున్నామన్నారు. చంద్రబాబు హాయాంలో టీడీపీ నేతలకే ప్రయోజనం చేకూర్చార‌ని మంత్రి ధ‌ర్మాన విమ‌ర్శించారు. 

తిత్లీ తుఫాను కార‌ణంగా పంట పోయిన రైతులకు రాష్ట్ర ప్ర‌భుత్వం అండ‌గా నిలిచింది. ఇవాళ ఉద్దానం వాకిట ప‌రిహారం అందించింది. 90 వేల మంది ల‌బ్ధి దారుల‌కు 182కోట్ల 60 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను పంపిణీ చేసి, బాధిత రైతుల‌ను ఆదుకుంది. ఈ సంద‌ర్భంగా పలాస మండ‌లం, బొడ్డ‌పాడు గ్రామంలో ఏర్పాటుచేసిన బ‌హిరంగ స‌భ‌లో రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మాట్లాడారు. ఆయ‌న ఏమ‌న్నారంటే.. 

"బొడ్డపాడు గ్రామం అనేక మంది వీరుల‌ను ఇచ్చిన గ్రామం..తుపాకీ యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర‌మ‌యి న నిరాశ, నిస్పృహ కార‌ణంగానే తుపాకీ ప‌ట్టారు. ఇటువంటి నిస్పృహ తొల‌గించేందుకు ఏం చేయాలి..? నిన్న‌మొన్న‌టి దాకా దిక్కు తోచ‌ని స్థితిలో ఎటువెళ్లాలో తేల్చుకోలేక ఏమీ తెలియ‌ని వారు ఉన్నారు..బ‌ల‌హీనులు ఉన్నారు.  ఇటువంటి వారి కోరిక‌లు  నెర‌వేర్చ‌డంలో ఇక్క‌డేమ‌యినా ఉద్య‌మాలు చేశారా.. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంక్షేమ ప‌థ‌కాలు అందుకోవ‌డానికి ఎవ్వ‌రి వ‌ద్ద త‌లవంచ‌కుండా, అధికారులే వ‌చ్చి గౌర‌వంగా ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందించే ప‌ద్ధ‌తి ఒక‌టి ఇవాళ అమ‌లులో  ఉంది."  

అందుకే అవినీతికి తావులేదు..నిర్థిష్ట ఆశ‌యం కోసమే ప‌నిచేస్తున్నాం
"అందుకే అవినీతికి ఆస్కారం లేకుండా చేసిన ప్ర‌భుత్వం ఇది అని గ‌ర్వంగా చెప్పుకుంటున్నాం. ఆత్మ‌విశ్వాసాన్ని తాక‌ట్టు పెట్ట‌కుండా సంక్షేమ ప‌థ‌కాల వ‌ర్తింపు..అన్న‌ది చేస్తున్నాం. గ‌త ప్ర‌భుత్వానికీ, ప్ర‌స్తుత ప్ర‌భుత్వానికీ ఉన్న తేడా గ‌మ‌నించాలి.. ప్ర‌శ్నించాలి. ఊళ్లో ఉండే కొంద‌రు తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు అబ‌ద్ధ‌పు ప్ర‌చారం చేస్తున్నారు. నిర్థిష్ట‌మ‌యిన ఆశ‌యం కోసం ప‌నిచేస్తున్న ప్ర‌భుత్వం ఇది. తార‌త‌మ్యాలు లేకుండాఉండేందుకు కృషి చేస్తున్న ప్ర‌భుత్వం ఇది. ఈ భావ‌జాలానికి సంబంధించి క‌నీసం ఆలోచించ‌కుండా విప‌క్ష నేత చంద్ర‌బాబు మాట్లాడుతున్నారు. డ‌బ్బులు పంచేస్తున్నాం అని చంద్ర‌బాబు చెబుతున్నారు. ఇవి ఆపేస్తే నిస్పృహతో ఉన్న వ‌ర్గాల‌కు బాధిత వ‌ర్గాల‌కు మీరు ఇచ్చేది ఏంటి ? వీటి గురించి గ్రామాల‌లో చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. తెలుగుదేశం పార్టీ ఇవ‌న్నీ చేయొద్దు అని అంటుందా.. ? " 

సామాజిక దృక్ప‌థంను ..విప‌క్ష నేత‌లు అర్థం చేసుకోవాలి 
"ఇంటి నిర్మాణం నిమిత్తం పేద‌ల‌కు స్థ‌లం ఇవ్వ‌డం అన్యాయం.. పింఛ‌ను ఇవ్వ‌డం అన్యాయం  అని తెలుగుదేశం అంటోంది. అంటే ఏం చేద్దామ‌ని తెలుగుదేశం పార్టీ అనుకుంటోంది..అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తారో, ఏం ఇస్తారో అన్న‌వి చెప్పాలి క‌దా ! అంద‌రి క‌న్నా పెద్ద క‌మ్యూనిస్టు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి .. అని ఇప్పుడే ఓ మిత్రుడు అన్నారు. అదే నిజం. అన్ని వ‌ర్గాల‌కూ న్యాయం ద‌క్కే విధంగా ప‌నిచేస్తున్నాం. మూడేళ్ల‌లో చాలా చేశాం. ఇంకా చేయాల్సి ఉంది. సామాజిక దృక్పథంతో ప‌ని చేస్తున్న ప్ర‌భుత్వం ఇది. "  

త్వ‌ర‌లోనే వంశ‌ధార 
"త్వ‌ర‌లో హిర‌మండ‌లం నుంచి వంశ‌ధార నీరు నిరాటంకంగా ఉద్దానం ప్రాంతం అంత‌టికీ నీరు అందించ‌నున్నాం. ఉద్దానం 
సమ‌స్య‌ల‌కు సంబంధించి ఆ రోజు ఎంద‌రెంద‌రో నాయ‌కులు తిరిగారు..కానీ ఇప్పుడు కిడ్నీ వ్యాధికి సంబంధించి ఒక్క వార్త వ‌స్తుందా ? ఈ ప్రాంతంలో బాధిత వ‌ర్గాల‌కు చేరువగా డయాల‌సిస్ సెంట‌ర్ల ఏర్పాటుతో పాటు, రెండు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌తో ప్ర‌తిపాదిత ప‌లాస ప్రాంతంలో హాస్పిట‌ల్ నిర్మాణం కూడా జ‌రుగుతోంది. అలా అని ఈ ప్రాంతంలో వ్యాధి లేద‌ని చెప్ప‌డం లేదు. వ్యాధి తీవ్ర‌త త‌గ్గించేందుకు  ప్ర‌భుత్వం ఎంత‌గానో కృషి చేస్తుంద‌ని మాత్ర‌మే అంటున్నాను." 

లంచాలు లేవు ..ఎవ్వ‌రి వ‌ద్ద త‌ల‌వంచొద్దు కూడా ! 
" మాజీ ప్ర‌ధాని రాజీవ్  గాంధీ లాంటి వారే ఓ సంద‌ర్భంలో చెప్పారు. సంక్షేమ ప‌థ‌కాల‌కు ఇచ్చే మొత్తంలో తొంభై శాతం  మ‌ధ్య‌వ‌ర్తుల ద‌గ్గ‌రే ఉండిపోతుంది అని వేద‌న చెందారు. ల‌క్షా 40 వేల కోట్ల రూపాయ‌లు అర్హుల‌యిన వారి ఖాతాల‌కు పంపించాం. మీరెవ‌ర‌యినా ఓ వీఆర్వోకో, ఓ సర్పంచ్-కో ప‌థ‌కాల వ‌ర్తింపు విష‌య‌మై ఒక్క న‌యా పైసా అయినా ఇచ్చామ‌ని చెప్ప‌గ‌ల‌రా? "

ఇంకొంద‌రికి కూడా సాయం.. అన్ని ప్ర‌తిపాద‌న‌ల‌కూ న్యాయం 
"75 ఏళ్ల‌లో చేయ‌లేమ‌ని ప్ర‌భుత్వాలు చేతులెత్తేస్తే, ఆ ప‌ని యువ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చేస్తుంటే దానిని మార్పు అన‌లేమా ! విప‌క్ష నేత చంద్ర‌బాబు  నాయుడు కూడా ఎక్క‌డా అవినీతి  జరిగింద‌ని చెప్ప‌లేక‌పోతున్నారు. సాధార‌ణ ప్ర‌జ‌లు ఇది మార్పు అని అన‌రా ?  తిత్లీ బాధితుల‌కు ఇవాళ చేసిన ఆర్థిక సాయం అందిందీ అంటే ముఖ్య‌మంత్రి ప‌ట్టుద‌ల కార‌ణంగానే సాధ్య‌మైంది.  
ఏ ప్ర‌భుత్వంలో అయినా చిన్నా చిత‌కా పొర‌పాట్లు ఉంటాయి.. ఒప్పుకుంటున్నా.. వాటిని కూడా దిద్దుకుంటాం. తిత్లీకి సంబంధించి పంట కోల్పోయిన వారిలో, ఇంకా ఇత‌ర ఆస్తి న‌ష్టం సంభ‌వించిన వారిలో మ‌రో ఆరు వేల మందికి అర్హులు ఉన్నార‌ని  ఇక్క‌డి వారు చెప్పారు. వారికి కూడా సాయం అందేలా చేద్దాం. ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి ప‌రిష్క‌రిద్దాం." 

సీఎం స‌భ‌కు త‌ర‌లి రండి .. ఆయ‌న భావ‌జాలం వినండి 
"పార్టీలు చూడ‌కుండా ప‌థ‌కాల వ‌ర్తింపు అన్న‌ది వైఎస్సార్ చేసేవారు.. అదే పాటిస్తున్నాం. ఈ నెల 27న  ఉద‌యం  జిల్లాకు సీఎం వ‌స్తున్నారు. మీరంతా రండి. విద్య‌కు సీఎం ఏ విధంగా ప్రాధాన్యం ఇస్తున్నారో తెలుసుకోండి. అక్ష‌రాస్య‌త‌లో దేశంలోనే మ‌నం 22వ స్థానంలో ఉన్నాం. కానీ ప్ర‌పంచ స్థాయిలో ఉన్న‌త విద్యావంతుల జాబితాలో మ‌నోళ్లే ఉన్నారు. కానీ ఎందుక‌ని ? ఈ స్థానం  మ‌న‌కు ! విద్య‌కు సరిప‌డినంత మౌలిక వస‌తులు అందించ‌ని కార‌ణంగానే  ఈ ప‌రిస్థితి త‌లెత్తింద‌ని భావిస్తున్నా. ఇప్పుడు వాటిని మారుస్తున్నాం. " 
 
ఆర్థికంగా ఆదుకునే అమ్మ ఒడి 
"డ్రాపౌట్లు త‌గ్గించే ప‌నిలో భాగంగా విద్య‌కు మిక్కిలి నిధులు కేటాయిస్తున్నాం. అర్హుల‌యిన వారికి అమ్మ ఒడి వ‌ర్తింప‌జేస్తున్నాం. త‌ల్లుల ఆర్థిక ప‌రిస్థితి కార‌ణంగా చ‌దువులు మాన్పించ‌కూడ‌ద‌న్న సంక‌ల్పంతోనే ప‌నిచేస్తున్నాం. అందుకే అమ్మ ఒడి. స‌ర్కారు స్కూలుకు ఆధునిక వ‌స‌తులు క‌ల్పించ‌డం మొద‌లుకుని నాణ్య‌మైన భోజ‌నం, యూనిఫాం అందించడం వ‌ర‌కూ ఈ ప్ర‌భుత్వం కృషి చేస్తోంది. ఇంకా  పార్టీ కార్య‌క‌ర్త‌లు అసంతృప్తితో ఉన్నారు అని అంటున్నారు. ఇది స‌బ‌బు కాదు. రాజ‌కీయ పార్టీ కార్య‌క‌ర్త అంటే సేవ చేసే గుణం ఉన్న‌వారు అని అర్థం. క‌నుక అటువంటి అసంతృప్త‌త‌ల‌కు తావేలేదు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ తిత్లీ తుఫాను కార‌ణంగా క‌ష్ట కాలంలో ఉన్న 90 వేల మంది లబ్ధిదారులకు  182 కోట్ల 60 ల‌క్ష‌ల ఆరు వేలు  జ‌మ చేయ‌డం ఆనందంగా ఉంది.." అని అన్నారాయ‌న. మిగిలిన బాధితుల‌కూ సాయం అందిస్తాం..అని చెప్పారాయ‌న. కార్యక్రమంలో శాసన సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రి సిదిరి అప్పలరాజు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పాత‌ప‌ట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు, కలెక్టర్ శ్రీకేష్.బి.లఠ్క‌ర్, జెడ్పీ చర్మన్ పిరియా విజయ, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి తదితరులు పాల్గొన్నారు.

Back to Top