అమరావతిలోని అసైన్డ్‌ భూముల రికార్డులు బాబు మాయం చేశారు

 అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కామ్‌పై చర్చలో మంత్రి ధర్మాన ప్రసాదరావు

అమ‌రావ‌తి: హైదరాబాద్‌లో చేసిన మాదిరిగానే అమరావతిలోనూ చేయాలని చంద్రబాబు ప్లాన్ చేశార‌ని మంత్రి ధర్మాన ప్రసాదరావు విమ‌ర్శించారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ డబ్బుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్ చేసి అభివృద్ధి ఫలాలను తన వర్గానికి దక్కేలా చేశార‌ని మండిప‌డ్డారు. అమరావతిలోనూ అదే అమలు చేయాలని చూశార‌ని త‌ప్పుప‌ట్టారు. బినామీ పేర్లతో ఎన్ని  వందల ఎకరాలు కొనుగోలు  చేశారో తెలీద‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. అమరావ‌తిలో హెరిటేజ్‌ సంస్థ భూములు కొనుగోలు చేసింది. తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మి అవకతవకలకు పాల్పడ్డార‌ని ధ్వ‌జ‌మెత్తారు. అమరావతిలోని అసైన్డ్‌ భూముల రికార్డులను మాయం చేశార‌ని మంత్రి ధర్మాన ప్రసాద రావు పేర్కొన్నారు. రికార్డులను మాయం చేసి పేదలను బెదిరించి భూములు లాక్కున్నారు. ఒక్కరి ప్రయోజనం కోసం అప్పటి ప్రభుత్వం యంత్రాంగాన్ని ఉపయోగించుకుంద‌న్నారు. హైదరాబాద్‌లో అభివృద్ధి ఫలాలను తనవాళ్లకే దక్కేలా చేశారు. హైదరాబాద్‌లో చేసిన మాదిరిగానే అమరావతిలోనూ చేయాలని బాబుప్లాన్ చేశార‌ని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు వివ‌రించారు.

Back to Top