శ్రీకాకుళం: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరిదని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. సోమవారం రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇవాళ నిమ్మాడ గ్రామం, పరిసర ప్రాంతాల్లో నూ పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. వాండ్రాడలో రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం భవనాన్ని ప్రారంభించి,అక్కడి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. నాడు - నేడు కార్యాచరణ అమలులో భాగంగా చిన్నబమ్మిడి జిల్లా పరిష త్ ఉన్నత పాఠశాలలో (అంచనా విలువ 61.42 లక్షలు) చేపట్టిన పనులను సైతం ప్రారంభించారు. రూ.1.85 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (నిమ్మాడ) ప్రారంభించారు. అనంతరం నిమ్మాడ జంక్షన్లో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ..."ప్రజలందరి ప్రభుత్వం ఇది. వివక్షకు ఇక్కడ తావు లేదు. అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకూ సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. అలానే గ్రామాలలో సమగ్ర భూ సర్వే చేపట్టాం. సమగ్ర భూ సర్వే జరిగి వందేళ్లు అవుతుంది. బ్రిటిష్ కాలం నాటి రెవెన్యూ రికార్డులపైనే మనం ఈనాటికీ ఆధార పడి ఉన్నాం. అందుకే శాస్త్రీయతకు చోటు ఇస్తూ, ఆధునిక యంత్రాలతో కూడిన సర్వే చేపడుతున్నాం. స్వాతంత్ర్యం వచ్చాక ఈ 75 ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఎవ్వరూ ఆ పని చేయడానికి ప్రయత్నం చేయలేదు. సమాజం స్థితిలో మార్పు కోసం, ప్రయోజనం కోసం,అలానే ఉన్నతి కోరి వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామాలలో తగువులు లేకుండా, ఒక్క పైసా కూడ తీసుకోకుండా, ఉచితంగా హద్దులు వేసి ఇస్తున్నాం. ఇది ఓట్లు కోసం చేసిన పని కాదు. మంచి మార్పు కోరి, శాంతియుత జీవనం కోరి చేస్తున్న పని. గతంలో భూ తగాదాల కారణంగా అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య తగాదాలు రేగేవి. దీంతో కోర్టులో ఏళ్ల తరబడి వివాదాలు నడిచేవి. అలాంటివి లేకుండా ఉండేందుకే ఇవాళ సమగ్ర భూ సర్వే చేపట్టి, సంబంధిత వివరాలను అప్ డేట్ చేస్తున్నాం. ఇన్ని మంచి పనులు చేస్తున్న సీఎం వైయస్ జగన్ ను చంద్రబాబు సైకో అంటున్నారు. ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మీ చుట్టుపక్కల పరిసరాలను గమనించండి. ఏ మేరకు అభివృద్ధి జరిగిందో చూడండి. ధనవంతుల పిల్లలకు పోటీగా ఇవాళ విద్య అందుకునేందుకు వీలుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దాం. ఇవన్నీ పిల్లలు ఓటు వేస్తారని చేయడంలేదు. ఇన్ని చేస్తున్నా చంద్రబాబు కుమారుడు జగన్ ను సైకో అంటున్నారు. ఆయనే అసలైన సైకో. ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు మానుకోవాలి. స్కూల్లో ఆహ్లాద కరమైన వాతావరణం ఉంది. అందుకు తగ్గ వసతులు ఇవాళ అందుబాటులో ఉన్నాయి. విద్యతోనే సామాజిక ఉన్నతి అని గుర్తించి పనులు చేస్తున్నాం. నిధులు వెచ్చిస్తూ ఉన్నాం. నాలుగేళ్ల పాలనలో పౌరులు అందరూ ఏ మేరకు సంతృప్తి చెందారో ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇది వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వచ్చిన మార్పులు. పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం అవ్వకూడదు అని షూస్,బెల్ట్,యూనిఫాం, అలానే మంచి ఆహారం అందిస్తున్నాం. స్కూల్స్ లో మార్పులు గమనించాలి. అలానే విద్యకూ వైద్యానికీ ఇవాళ ప్రభుత్వం వెచ్చిస్తున్న ఖర్చును గుర్తించాలి. వేరే పార్టీల నాయకులు వారి స్వ ప్రయోజనం కోసం ఏవేవో చెప్పి ఉండొచ్చు. కానీ మన కళ్ళ ఎదుట జరుగుతున్న మార్పులను పరిగణించి,వాటికి కారణం అయిన వారికి మీరంతా మద్దతుగా నిలవాలి. ఆభరణాలు,ఆస్తులు కాదు. చదువు ఒక్కటే అని రకమైన ప్రమాణాలు ఇవ్వగలుగుతుంది. అందుకు సీఎం జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. అలానే ఇవాళ ఇల్లు లేని వారికి ఓ గూడు దక్కించాం. వారి కలలను నెరవేర్చాం. అలానే గ్రామీణ ప్రాంతాల పేదలకు,పట్టణ ప్రాంతాల పేదలకు వైద్య సేవలు అందిస్తున్నాం. ఆదేశిక సూత్రాలు పాటిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నాం. ఆంధ్ర జ్యోతి,ఈనాడు, చంద్రబాబు వీరంతా దొంగల ముఠా. రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు. వారి మాటలను కానీ అసత్య ప్రచారాలు కానీ నమ్మవద్దు. పౌరులకు ఎన్ని ప్రయోజనాలు చేకూరాయో ఒక్కసారి నేరుగా వచ్చి చూడాలి. ఎలాంటి లంచాలు లేని సమాజాన్ని సృష్టించాము.14 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు. ఏం సాధించారు ? ఇప్పుడు మళ్లీ ఒక్క అవకాశం ఇవ్వండి అని ఏ ముఖం పెట్టుకొని ఊళ్లల్లోకి వస్తున్నారు. ? అని నేను ప్రశ్నిస్తున్నాను. అధికారంలో ఉన్నంత కాలం చెరువు పనులు పేరు చెప్పి, రోడ్డు పనులు పేరు చెప్పి మీరంతా నిధులు గుంజుకున్నారు. మేము ఈ నాలుగేళ్లలో ఎన్ని మార్పులు తీసుకువచ్చామో చెబుతాం..చంద్రబాబు టీడీపీ హయాంలో ఏం సాధించారో చెప్పగలరా.. ? ఆ రోజు ఎన్నికల ముందు 6 వేల కోట్ల రూపాయలతో బాహుదా నది అనుసంధానం అని విపక్ష నేత చంద్రబాబు అన్నారు. కేవలం ఎలక్షన్ ఫండ్ కోసం చేసిన పని అది. నేరడి బ్యారేజీ విషయమై ఒడిశాతో ఉన్న వివాదాన్ని ముగించలేదు. అలానే వారితో మాట్లాడిన దాఖలాలు లేవు. నిమ్మడ గ్రామాల్లో కూడా వైయస్ఆర్‌సీపీ కి ఓటు వేయని వారికి పథకాలు అందిస్తున్నాం. రాష్ట్రాన్ని చంద్రబాబు దోచుకు తిన్నారు. ప్రజలను మోసం చేసి తనవారికి చంద్రబాబు దోచిపెట్టారు. అమరావతి పేరుతో దోపిడీ జరిగింది. రానున్న కాలంలో దేశంలో మన రాష్ట్రం సీఎం వైయస్ జగన్ నేతృత్వంలో అగ్రగామిగా ఉండబోతోంది. 12 వేల 800 కోట్లు వెచ్చించి మరీ! పేద ప్రజల ఇంటి కోసం భూమి కొన్నాము. అచ్చెం నాయుడు చెప్పగలరా ఎక్కడైనా ఎకరా అయినా కొన్నాం అని చెప్పగలరా ? అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, టెక్కలి నియోజకవర్గం వైయస్ఆర్‌సీపీ ఇన్చార్జ్ దువ్వాడ వాణి శ్రీనివాస్, మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి తదితరులు పాల్గొన్నారు.