శ్రీవారి సన్నిధిలో మంత్రి ధర్మాన ప్రసాదరావు 

తిరుమల:  రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మంగ‌ళ‌వారం శ్రీవారిని దర్శించుకున్నారు.  మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రికి టిటిడి ఆలయ అధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. దర్శనానంతరం మంత్రికి వేదపండితులు వేదశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలు, పట్టు వస్త్రాలను అందజేశారు. స్వామి వారిని  దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి ధ‌ర్మాన‌ పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top