డిప్యూటీ స్పీకర్‌గా మీ ఎన్నిక మాకు గర్వకారణం

స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ ఉత్తరాంధ్రప్రాంత వాసులేకావడం సంతోషకరం

ఈ అవకాశం కల్పించిన సీఎం వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు

శాసనసభలో మంత్రి ధర్మాన ప్రసాదరావు

అసెంబ్లీ: ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కోలగట్ల వీరభద్రస్వామి ఉపసభాపతిగా ఎన్నికవ్వడం అందరికీ గర్వకారణం అని, సభాపతిగా, ఉపసభాపతిగా ఇద్దరూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవారు కావడం సంతోషం కలిగించే విషయమని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శాసనసభ ఉప సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కోలగట్ల  వీరభద్రస్వామికి మంత్రి ధర్మాన అభినందనలు తెలిపారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘వ్యాపార కుటుంబంలో జన్మించిన మీరు రాజ్యాంగ పదవిని అధిష్టించడం ఆనందంగా ఉందన్నారు. నిరంతరం ప్రజలతో ఉండి.. ప్రజల సమస్యలను అర్థం చేసుకొని మంచి వ్యక్తిగా పేరుగాంచిన మీరు రాజ్యాంగ పదవిని కూడా బ్రహ్మాండంగా నిర్వహించగలరని నమ్ముతున్నాను. దానికి కారణం శాసనసభ్యులుగా, మండలి సభ్యులుగా ఉన్న మీకు అనుభవం. అనేక ఎత్తుగడల మధ్యన ప్రజల తాలూకా అభిప్రాయాలు ఎక్కడా గొంతునొక్కపడకూడదు. అది ప్రధాన లక్ష్యంగా విజయవంతం అవుతారని నమ్ముతున్నాం. సౌమ్యుడిగా, అందరినీ ఆదరించే వ్యక్తిగా మీకు పేరుంది. వైశ్య కులంలో జన్మించినవారు రాజ్యాంగ పదవి చేపట్టడం ఇదే మొదటిసారి.. మీరే మొదటివారు.. ఇది వైశ్యులందరూ గౌరవంగా భావిస్తున్నారు. ఇలాంటి కల్పించిన సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సభ నిర్వహణలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని, చిరకాలం జ్ఞాపక ఉండే రీతిలో సభను నిర్వహించాలని కోరుకుంటున్నాను’’ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top