పింఛ‌ను ఆపిన పాపం చంద్ర‌బాబుదే

కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో మంత్రి ధర్మాన ప్ర‌సాద‌రావు

చంద్రబాబుకు అధికారం ఇస్తే  ప్ర‌జా ప్ర‌యోజ‌నాలు అన్నీ గాలికి

ప‌థ‌కాలు అన్నీ గాలికి..ఆయ‌నొక్క‌డికే అంతా ల‌బ్ధి

అప్పుడేమో తిట్టారు ఇప్పుడేమో వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ఉంచుతాం అని అంటున్నారు

చంద్ర‌బాబు రాజ‌కీయం అయిన వారికి దోచిపెట్టేందుకే

శ్రీ‌కాకుళం: అవ్వాతాత‌ల‌కు పింఛ‌ను అంద‌నివ్వకుండా చేసిన పాపం చంద్ర‌బాబుదే అని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు విమ‌ర్శించారు. ఆయ‌న బినామీ సంస్థ ఒక‌టి ఈసీకి ఫిర్యాదు చేసిన ఫ‌లితంగానే ఇవాళ వ‌లంటీర్ల ద్వారా పింఛ‌న్లు ఒక‌టో తారీఖుకే అంద‌లేద‌ని అన్నారు. అందుకు కార‌ణం చంద్ర‌బాబే. ఈ పాపం ఆయ‌నే చేశారు. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ జోక్యంతో పింఛ‌న్ల పంపిణీ అన్న‌ది వ‌లంటీర్లు చేయ‌కూడ‌ద‌ని నిబంధ‌న‌లు ఉన్నాయి. అంటే ఈ మూడ్నెల్లూ సంబంధిత ల‌బ్ధిదారులు చుక్క‌లు చూడాల్సిందే. చంద్ర‌బాబుకు అధికారం ఇస్తే ఇలానే ఇప్ప‌టిలానే ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను గాలికి వ‌దిలేస్తారు. ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తారు. త‌న స్వార్థం చూసుకుని ప్ర‌జా ప్ర‌యోజ‌నం అన్న‌ది ప‌ట్టించుకోర‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ్రీ‌కాకుళం న‌గ‌రంలోని  స‌న్ రైజ్ హోట‌ల్లో ఏర్పాటు చేసిన కార్య‌క‌ర్త‌ల స‌మావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి ధ‌ర్మాన హాజ‌ర‌యి ఆత్మీయ సందేశం అందించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.."విప‌క్ష నేత చంద్రబాబు అధికారంలో ఉన్న‌న్ని రోజులూ దోచుకోవడం కోసమే తప్ప ఇతర వర్గాలు కోసం ఆలోచన చేసింది ఏమీ లేదు. గ‌డిచిన నాలుగున్న‌రేళ్లూ రాష్ట్ర వ్యాప్తంగా 70 ల‌క్ష‌ల మందికి పింఛ‌న్లు పంపిణీ చేశాం. సూర్యోద‌యానికి ముందే నిబ‌ద్ధ‌త‌తో కూడిన వ‌లంటీర్లు ఇంటింటికీ చేరుకుని ల‌బ్ధిదారుల‌కు పింఛ‌న్లు అందించేవారు. కానీ నిన్నటి వేళ (ఏప్రిల్ ఒక‌టో తారీఖు) ఆ విధంగా అవ్వలేదు. ఇందుకు కారణం చంద్రబాబు. ఆయ‌న కార‌ణంగానే ఎలక్షన్ కమిషన్ ఉత్త‌ర్వులు ఇచ్చి పింఛ‌న్ల పంపిణీలో వ‌లంటీర్లను భాగం చేయ‌వ‌ద్ద‌ని పేర్కొంది. ఇదంతా చంద్ర‌బాబు చేసిన కుట్ర ఫ‌లితం. ప్ర‌భుత్వం ఇచ్చే మూడు వేల రూపాయ‌ల పించ‌ను కోసం నెలంతా వృద్ధులు నిరీక్షిస్తుంటారు. చంద్ర‌బాబుకు వారి బాధ‌లు ప‌ట్ట‌వు. అధికారం ఒక్క‌టే ఆయ‌న‌కు కావాలి. అధికారం రాక‌మునుపే చంద్రబాబు ఇలా ఉంటే,రేప‌టి వేళ అధికారం వచ్చాక చంద్రబాబు పథకాలు ఇస్తాడ‌ని ఏంటి గ్యారంటీ. ఏవీ ఇవ్వడ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

అధికారం ముఖ్యమా ? ప్రజలు ముఖ్యమా ? అని చంద్రబాబును ప్ర‌శ్నిస్తున్నాను. అనేక సందర్భాల్లోవ‌లంటీర్లను చంద్ర‌బాబు తిట్టారు. సంఘ విద్రోహ శ‌క్తులుగా పేర్కొన్నారు. డేటా మిస్ యూజ్ అవుతుంద‌ని కూడా అన్నారు. కానీ ఇప్పుడు అదే వ‌లంటీరు వ్య‌వ‌స్థ‌ను తొల‌గించం అని అంటున్నారు. ఎంత‌టి అవ‌కాశవాద రాజకీయమో మీరు ఒక్క‌సారి ఆలోచించండి. తాము అధికారం లోకి వ‌చ్చాక వ‌లంటీరు వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగిస్తామ‌ని చెబుతున్నారు...దీనిపై త‌మ కూట‌మికి ఓ స్ప‌ష్ట‌త ఉంద‌ని ఆయ‌న అంటున్నారు. కానీ ఆ రోజు వ‌లంటీర్ల‌పై ఎంత‌టి బ‌జారు భాష వాడారో చాలా మందికి తెలుసు. వారిని కించ‌ప‌రుస్తూ మాట్లాడిన వైనం ఎవ్వ‌రూ మ‌రిచిపోలేరు. ప‌ద్నాగేళ్లు సీఎంగా ఉన్న వ్య‌క్తి ఓ వైపు.,ఐదేళ్ల గొప్ప పాల‌న అందించిన జ‌గ‌న్ మ‌రోవైపు. చెప్పిన మాట తూ.చ.త‌ప్ప‌కుండా ఆచ‌రించిన వైయ‌స్‌ జ‌గ‌న్ ను మ‌రోసారి ఆద‌రించండి. ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి. అధికారంలోకి రాక‌ మునుపు ఏం చెప్పారో..వ‌చ్చాక అవ‌న్నీ చేసి చూపించారు. పాద‌యాత్ర‌లో భాగంగా ప్ర‌జ‌లకు ఇచ్చిన మాట ఆయ‌న త‌ప్ప‌లేదు. 

మారుతున్న సమాజంలో కొన్ని వృత్తులు నిరాదరణ కి గురి అయ్యాయి.మిగతా సమాజం వారికి తక్కువ చుసే రోజులు ఏర్పడ్డాయి. స్వాతంత్ర్యం వచ్చాక అన్ని కులాలకూ చెందిన వారి బాగోగులు చూడాలి. ఆ ప‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం చేసింది. అన్ని కులాల ఉన్న‌తికీ స‌మున్న‌త ప్రాధాన్యం ఇచ్చింది. స్వాతంత్ర్య వ‌చ్చిన 75 ఏళ్ల త‌రువాత వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం వ‌చ్చింది. అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి నేటి వ‌ర‌కూ పాల‌న‌లో ఎన్నో క్రియాశీల మార్పులు తీసుకుని వ‌చ్చింది. ఒక కులంలో పుట్టిన వారి పిల్లలు అదే వృత్తిలో ఉండిపోకూడదు అని భావించి,పాలనలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చారు. ఇవాళ స‌ర్కారు బ‌డుల‌కు వెళ్తున్న పిల్ల‌ల‌కు మంచి చ‌దువుతో పాటే నాణ్య‌మ‌యిన రీతిలో పుస్త‌కాలు ఇంకా ఇత‌ర సామాగ్రి అందించామ‌ని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా పోష‌కాహారం అందించాం. అమ్మ ఒడి పేరిట పిల్ల‌ల చదువు త‌ల్లుల‌కు భారం కాకూడ‌ద‌ని ఏడాదికి 15 వేల రూపాయ‌ల చొప్పున చెల్లిస్తూ..అమ్మ ఒడి ప‌థ‌కాన్ని అమ‌లు చేశాం. అర్హ‌త ఉంటే చాలు అందరికీ అన్ని పథకాలూ ఇచ్చామ‌ని మంత్రి ధ‌ర్మాన తెలిపారు.

ఇది గొప్ప మనసు కలిగిన జగన్ వల్లనే సాధ్యం అయ్యింది. ఓ స‌మాజం పురోగ‌తిని సాధించాలంటే విద్య ఎంతో అవ‌స‌రం. అందు కే విద్య‌కు ప్రాధాన్యం ఇచ్చాం. ఇన్ని కార్యక్ర‌మాలు ప్ర‌జోప‌యోగ రీతిలో చేస్తుంటే తెలుగు దేశం యువ నాయ‌కులు లోకేశ్ క‌నీస అవ‌గాహ‌న లేకుండా మాట్లాడ‌డం బాధాక‌రం.  జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌క్క రాష్ట్రంలో ఉంటూ ఈ రాష్ట్రంలో రాజ‌కీ యాలు చేస్తున్నారు. చంద్ర‌బాబు కూడా ఇదే మాదిరిగా హైద్రాబాద్ లో అన్నీ పెట్టుకుని ఇక్క‌డ రాజ‌కీయం చేస్తున్నారు.

మ‌న రాష్ట్రంలో లేని వారికి మ‌న రాష్ట్ర ప‌రిణామాల‌తో ఏంటి సంబంధం ? రేప‌టి వేళ ఎన్నికలు అయిపోయాక వాళ్ళు పక్క రాష్ట్రా నికి  వెళ్ళిపోతారు. బీసీల బాగు కోసం ఒక ఉప‌న్యాసం ఇస్తే స‌రిపోతుందా చంద్ర‌బాబు ? అని నేను ప్ర‌శ్నిస్తున్నాను. 
సమాజంలో ఉన్న చిన్న,చిన్న కులాల కోసం ఏ రోజైనా చంద్రబాబు ఆలోచన చేశారా.. ? ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ప్రభుత్వాలే కదా !  ప్రజల స్థితిగతులు మారుస్తాయి. మీ కుటుంబం అంతా ఒక చోట కూర్చొని ఈ ప్రభుత్వం ఈ ఐదేళ్ల‌లో ఏం చేసిందో ఒక్క‌సారి ఆలోచించండి. అప్ప‌టి వ‌ర‌కూ మేం ప‌థ‌కాలు ఇస్తాం మాకు స‌లాం కొట్టుకుని ఉండాలి అన్న విధంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ విధంగా లేదు. ఇవాళ ప‌థ‌కాల అమ‌లులో పార్టీ లేదు,కులం లేదు. ఓటు వేశారో లేదో అన్న‌ది చూడలేదు. రేపు వేస్తారో లేదో అన్న‌ది కూడా ప‌ట్టించుకోలేదు. పేదరికం ఒక్క‌టే అర్హత. ఆ ఒక్క‌టి చూసి ప‌థ‌కాలు అందించాం. రాజ్యాంగ స్ఫూర్తిని చాటుకుంటూ త‌ద‌నుగుణంగా మా ప్ర‌భుత్వం ప‌నిచేసింద‌ని మంత్రి తెలిపారు.

ర‌జ‌కుల‌ను కానీ ఇంకా సంబంధిత ఏ ఇత‌ర కుల‌స్తుల‌ను అయినా చుల‌క‌న చేస్తే వెంట‌నే ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాలి. ఈ ఆలోచ‌న‌లో భాగంగా రానున్న కాలంలో సామాజికంగా ఏ ఎదుగుల లేక అవ‌స్థ‌లు ప‌డుతున్న అత్యంత వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు మా ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది. ఈ ఐదేళ్లలో చిన్న కులాలకు తోడుగా ఉన్నాం. మ‌న ప‌ట్ట‌ణానికి సంబంధించి ఇళ్లు లేని నిరుపేద‌ల‌కు ఐదు వంద‌ల కోట్ల రూపాయ‌లు వెచ్చించి ఉచితంగా పట్టాలు ఇచ్చాం. అలానే కాల‌నీ నిర్మాణం చేప‌డుతున్నాం. హీరో పవన్ కళ్యాణ్ సినిమాలు వర‌కూ మాత్రమే ! ప్రజా ప్రయోజనాల సాధ‌న కోసం ఆలోచన చేసిందేమీ లేదు. ఈ నేపథ్యాన మీరంతా మీ సామాజిక ఉన్న‌తికి ఎవ‌రు కార‌ణం అయ్యారో ఆలోచించి ఆ విధంగా మీ ఓటు హ‌క్కును వినియోగించుకోండి. ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.

 కుప్పిలి సూర్యారావు అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి  వైయ‌స్ఆర్‌సీపీ బీసీ సెల్ అధ్యక్షులు కె.శ్రీనివాస్, రాష్ట్ర బీసీ సెల్ నాయకులు నగవరపు రాజు, కంచెర్ల అరుణ, గండేపల్లి విజయ బాబు, పట్టణ అధ్యక్షులు కురిటి అప్పారావు, సునురు నర్సింహులు, చిట్టి వలస గణేష్, జిల్లా  వైయ‌స్ఆర్‌సీపీ ఉపాధ్యక్షులు రౌత్ శంకర రావు, తదితరులు పాల్గొన్నారు.

Back to Top