శ్రీకాకుళం: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం బడుగుల ఉన్నతికి కృషి చేస్తోందని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. వమరవిల్లి గ్రామ పంచాయతీ లో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంత్రి నిర్వహించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మంత్రి ధర్మాన మమేకం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. గడిచిన అనేక దశాబ్దాల నుంచి నెలకొన్ని ఉన్న సమస్యలు తీర్చాం. ఏమీ లేని నిర్భాగ్యులకు భవిషత్ పై ఆశావహ దృక్పథాన్ని పెంపొందింపజేశాం. ఇందుకు కారణం నాలుగున్నర ఏళ్ల క్రితం మీరు ఎన్నుకున్న వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకూ ప్రభుత్వం తరఫున మాకు ఏమీ దక్క లేదు అని నిరాశలో వెళ్లిపోయిన వారికి భరోసా ఇచ్చాం. ఇవాళ మా ఇంటి వద్దకు నీరు వచ్చింది.మాకు ఇల్లు వచ్చింది. అని మీరంతా అంటున్నారు. సంతోషం. మా పిల్లాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడు, మాకు ఏం జరిగినా ఈ ప్రభుత్వం ఉంది అన్న ధైర్యం ఉంది అని చెప్పగలుగుతున్నారు ఇవాళ మీరంతా..ఇదంతా మీరు ఎన్నుకున్న మీరు ఓటేసి గెలిపించిన ప్రభుత్వం వల్లే సాధ్యం అయిందని మరొక్కసారి విన్నవిస్తున్నాను. అలానే ఇప్పుడే నా దృష్టికి వచ్చిన రహదారి సమస్యను కూడా పరిష్కరిస్తాం. హేమ్లెట్ విలేజ్ హుకుం పేట రోడ్ మరో నెల రోజుల్లో పూర్తి చేస్తాం. పాలనలో ఏ రోజూ కులం,మతం చూడలేదు. అర్హత ఒక్కటే చూసి పథకాలు వర్తింపజేస్తున్నాం. విమర్శలకు తావివ్వ నీయక పనిచేశాం. అందుకే విమర్శలు చేయలేక, ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. ధరలు పెరిగాయి అంటున్నాయి. అవి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. అబద్ధపు మాటలతో ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయి..దేశం మొత్తం మీద ఒకే ధరలు ఉన్నాయి అని తెలియజేస్తున్నాను. మీరు కావాలంటే పొరుగు రాష్ట్రాలతో ధరల విషయమై పోల్చి చూడండి. విద్యావిధానం అన్నది మారింది. వైద్య విధానం అన్నది మారింది. నాలుగేళ్లలో ప్రైవేటు స్కూల్ విద్యార్థుల కంటే ప్రభుత్వ బడుల్లో చదివే వారి ఉత్తీర్ణత ఉంది..నాలుగేళ్లలో విద్య పట్ల అనేక మార్పులు వచ్చాయి.. బుక్స్,షూస్,బెల్ట్,యూనిఫాంతో పాటు మంచి ఆహారం అందిస్తూ ఉన్నాం. జగనన్న కానుకతో పాటే విద్యా దీవెన,వసతి దీవెన అందిస్తూ ఉన్నాం. బడులకు పిల్లలను పంపే తల్లులకు అమ్మ ఒడి అందిస్తూ ఉన్నాం. మన అందరి పిల్లల భవిషత్ కోసం పని చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ప్రజల ధనాన్ని దోచుకొని కొందరు ఉన్నారు. అధికారం ఉన్న రోజు చట్టాలకు విరుద్ధంగా పని చేశారో,లేదా దౌర్జన్యంగా ఎవరు ఉన్నారో అన్నది ఇప్పుడిప్పుడే స్పష్టం అవుతోంది. వారి విషయంలో చట్టం ఒక్కటే..తప్పు చేసిన వారు అనుభవించాల్సిందే..చట్టం ముందు అందరూ సమానమే అని విన్నవిస్తూ ఉన్నాను. శిక్ష కోర్టులు నిర్ణయాలు చేస్తాయి. సానుభూతి కోసం డ్రామాలు ఆడుతున్నారు. పార్టీ అధిష్టానం చంద్రబాబు కోసం మోత మోగించండి అని,చప్పుడు చేయండి అంటే టీడీపి వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా ఉన్నారు.అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, డిసిఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణా మూర్తి, ఎంపిపి గొండు రఘురాం, స్థానిక సర్పంచ్ సుగ్గు లక్ష్మి దేవి, మధు రెడ్డి, నాటక అకాడమీ డైరెక్టర్ ముంజెటి కృష్ణ, బొడ్డే పల్లి పద్మజ, వైయస్ఆర్‌సీపీ మండల అధ్యకులు పీస గోపి, కొయ్యణ నగబుషన, మార్పు పృథ్వి, అరవాల రామ కృష్ణ, యాళ్ల నారాయణ, బరాటం శ్రీధర్, సిమ్మ ధర్మ రాజు, రామారావు, తదితరులు పాల్గొన్నారు.