ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం

మంత్రి ధర్మాన ప్రసాదరావు
 

అమరావతి: ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సమాధానం ఇచ్చారు. అవసరమైన మేర ఇళ్ల నిర్మాణాలకు రెవెన్యూ శాఖ తరఫున స్థలాలు కేటాయిస్తున్నామన్నారు. పేదల ఇళ్ల కోసం భూముల్ని కొనుగోలు చేశామన్నారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది గొప్ప విషయమన్నారు.
 

Back to Top