శ్రీకాకుళం: ప్రజలు చైతన్యవంతులు కాబట్టే చంద్రబాబును ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన మీడియాతో మాట్లాడుతూ.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి శూన్యమని ధ్వజమెత్తారు. ఇంకా ఏ మొహం పెట్టుకొని ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నాడని ప్రశ్నించారు. ప్రజా చైతన్య యాత్ర అంటూ చంద్రబాబు దొంగ యాత్రలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రెచ్చగొట్టే, మోసం చేసే పర్యటనలను మానుకోవాలని సూచించారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందని, మళ్లీ ఆయన తనయుడు సీఎం వైయస్ జగన్ పాలనలో మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు.