‘ఆయిల్‌ ట్యాంక్‌’ మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం 

బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి దాడిశెట్టి రాజా
 

కాకినాడ: ఆయిల్‌ ట్యాంక్‌లో ఊపిరాడక మృతిచెందిన ఘటనలో బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి దాడిశెట్టి రాజా భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలను మంత్రి దాడిశెట్టి రాజా పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించారని, ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి మరో రూ.25 లక్షలు అందేలా ఒప్పించారని, మొత్తంగా ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు సాయం అందేలా సీఎం వైయస్‌ జగన్‌ చర్యలు తీసుకున్నారన్నారు. అంతేకాకుండా మృతుల కుటుంబాల్లోని ఓ వ్యక్తికి ఉద్యోగం, ప్రభుత్వం తరఫు నుంచి ఏ విధమైన సహాయ, సహకారాలు కావాలన్నా అందేలా జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీని కూడా నియమించారని చెప్పారు. మృతుల కుటుంబాలకు సహాయ, సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తన వ్యక్తిగతంగా మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున మొత్తం రూ.3.50 లక్షల సాయం అందజేస్తున్నట్టు మంత్రి దాడిశెట్టి రాజా వివరించారు. 
 

Back to Top