టీడీపీ-జనసేనది ఎజెండా లేని జెండా సభ

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ 

తనకు సలహాలు ఇవ్వవద్దని ప‌వ‌న్ చెప్పడం.. ఒక జాతిని అవమానించినట్లే

తెలుగుదేశం జెండాను మోయడమే పవన్ లక్ష్యమా?

 రాజ‌మండ్రి: టీడీపీ-జనసేనది ఎజెండా లేని జెండా సభ అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ అభివ‌ర్ణించారు. టీడీపీ-జనసేన జెండా సభలో పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు చూసి చదివాడని ఎద్దేవా చేశారు. నారా చంద్రబాబు నాయుడుది డైరెక్షన్ అయితే.. పవన్ కళ్యాణ్‌ది యాక్షన్ అని విమర్శించారు. చంద్రబాబు చెప్పింది పవన్ చేయడం వల్ల ముద్రగడ, హరిరామ జోగయ్య లాంటి వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తనకు సలహాలు ఇవ్వవద్దని చెప్పడం పవన్ ఒక జాతిని అవమానించినట్లే అని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.  తూర్పుగోదావరి జిల్లాలో గురువారం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు

టీడీపీ-జనసేన జెండా సభలో పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు చూసి చదివాడు. చంద్రబాబు నాయుడుది డైరెక్షన్ అయితే.. పవన్ కళ్యాణ్‌ది యాక్షన్. చంద్రబాబు చెప్పింది పవన్ చేయడం వల్ల ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య లాంటి వారు ఇబ్బందులు పడుతున్నారు. నాకు సలహాలు ఇవ్వవద్దని చెప్పడం పవన్ కళ్యాణ్ ఒక జాతిని అవమానించినట్లే. పవన్ కళ్యాణ్‌కి స్వేచ్ఛ లేదు. నిన్న జరిగిన జెండాని సభకి జెండా లేద‌న్నారు. 
 

ప‌వ‌న్ ఆ ప‌రిధి దాటారు..
 ఇన్ని రోజులూ పవన్ కళ్యాణ్‌కు పిచ్చి, ఉన్మాదం ఉందనుకున్నా. ఆయన మాటలు చూస్తే.. ఆ పరిధి దాటినట్లుంది. ఆశించిన మేర ప్రజలు రాకపోవడంతో అసహనానికి గురైనట్లు కనిపించారు. నేను పిచ్చోడిని, నన్ను నమ్మి ఓట్లు వేయవద్దని చెప్పేందుకు పవన్ వచ్చినట్లుంది. చంద్రబాబు వామానావతరం ఎత్తి కళ్యాణ్‌ను తొక్కారు. పవన్ కూడా ఆ అవతారం ఎత్తి.. నమ్ముకున్న నేతలు, కార్యకర్తలను తొక్కారు. జెండా సభ ఫ్లాఫ్ అయింది. 6 లక్షల మంది వస్తారన్నారు, 10 శాతం కూడా రాలేదు. జెండా సభ రెండు సామాజిక వర్గాలు పెట్టిన సభగా ఉంది. తెలుగుదేశం జెండాను మోయడమే పవన్ లక్ష్యమా? అని మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు.

Back to Top