టీడీపీ అర్థం లేని నోటీసులు ఇస్తున్నారు

 మంత్రి బుగ్గన రాజేంద్ర‌నాథ్‌రెడ్డి

అమ‌రావ‌తి:  టీడీపీ నేత‌లు అర్థం లేని నోటీసులు ఇస్తున్నార‌ని మంత్రి బుగ్గ‌న రాజేంద్రనాథ్‌రెడ్డి అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అసెంబ్లీలో టీడీపీ నేత‌లు చంద్ర‌బాబు అరెస్టుపై వాయిదా తీర్మానం కోర‌డ‌టం ప‌ట్ల మంత్రి అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. చంద్రబాబు అరెస్టుపై చర్చకు సిద్ధమ‌ని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. బీఏసీలో దీనిపై చర్చిద్దాం..  చర్చకు రండి అంటూ మంత్రి బుగ్గన టీడీపీ నేత‌ల‌కు సూచించారు. స్పీక‌ర్ చైర్ వ‌ద్ద‌కు వెళ్లి టీడీపీ స‌భ్యులు పేప‌ర్లు చింపి విసిరి వేయ‌డం స‌రికాద‌ని మంత్రి అన్నారు.

Back to Top