త‌ప్పు చేసి అవాస్త‌వాలు మాట్లాడుతున్నారు

- మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి

శాస‌న‌భ‌స‌భ వ్య‌వ‌హారాల మంత్రిగా న‌న్ను పిలిస్తే వెళ్లాను. మాట్లాడాను. అధికారులు కూడా వ‌చ్చారు. రికార్డింగ్‌లు అన్నీ చూశాను. నాకు చాలా బాధేసింది. వాస్త‌వంగా జ‌రిగింది ఒక‌టైతే.. ప్ర‌తిప‌క్ష టీడీపీ నాయ‌కులు అందుకు విరుద్ధంగా ప్ర‌చారం చేసుకుంటున్నారు. నేను అన్ని పార్టీల స‌భ్యుల‌తో మాట్లాడాను. చంద్ర‌బాబు హ‌యాంలో ఇక్క‌డ  నిర్మించిన ప్రాంగ‌ణం చాలా చిన్న‌దిగా ఉండ‌టంతో రావ‌డం పోవ‌డం క‌ష్టంగా ఉంది. పైగా చంద్ర‌బాబు ధ‌ర్నాగా భారీగా ఒకేసారి దూసుకొచ్చాడు. అందుకే సెక్యూరిటీ సిబ్బంది గేట్లు మూసి ఒక్కొక్క‌రిగా లోప‌లికి పంపిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ త‌నిఖీలు  మ‌న‌కోస‌మే చేస్తున్నారనే క‌నీస జ్ఞానం లేకుండా మాట్లాడటం స‌రికాదు. రూల్ బుక్ ప్ర‌కారమే మేం న‌డుచుకుంటున్నాం. వాళ్లు చేసిన రూల్స్‌ను వాళ్లే బ్రేక్ చేస్తు పోతున్నారు. ఇప్ప‌టికైనా టీడీపీ స‌భ్యులు త‌మ ప‌ద్ధ‌తి మార్చుకోక‌పోతే న‌ష్టం అంద‌రికీ జ‌రుగుతుంద‌ని గుర్తుంచుకోవాలి. అంద‌రూ స‌హ‌క‌రిస్తే అత్యంత ప్ర‌ధాన‌మైన `దిశ` చ‌ట్టం మీద చ‌ర్చ జ‌రగ‌బోతోంది. ప్ర‌తిప‌క్షం స‌హ‌క‌రించాలి. 

Read Also: శాసన సభను అవమానించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి

Back to Top