చంద్రబాబు అరెస్టుపై చర్చకు రెడీగా ఉన్నాం..

నినాదాలు చేస్తే దొంగ దొర అయిపోతాడా..?

శాసనమండలిలో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బొత్స ఆగ్రహం

శాసనమండలి: చట్టసభలు సజావుగా జరగనివ్వకుండా టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ సభా సమయాన్ని వృథా చేస్తున్నారని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలిలో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బొత్స ఫైర్‌ అయ్యారు. సభా సంప్రదాయాలను పాటించకుండా ప్రవర్తిస్తున్నారని, ప్రజలకు సంబంధించిన అంశాలపై చర్చిస్తుంటే పదే పదే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టుపై చర్చకు ప్రభుత్వం రెడీగా ఉందన్నారు. స్కిల్‌ స్కామ్‌లో ఆధారాలతో సహా సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసిందని, అరెస్టును వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తే దొంగ దొర అయిపోతాడా అని టీడీపీ సభ్యులను ప్రశ్నించారు. సభలో ఇలాంటి తీరు సరికాదని, నినాదాలు చేస్తూ సభా సమాయాన్ని వృథా చేస్తున్న టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్‌ను కోరారు. 

 

తాజా వీడియోలు

Back to Top