పేదలకు మంచి జరుగుతుంటే టీడీపీకి కడుపు మంట

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

విజ‌య‌వాడ‌:  పేద‌ల‌కు మంచి జ‌రుగుతుంటే టీడీపీకి క‌డుపు మంట‌గా ఉంద‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీంకోర్టు తీర్పును మంత్రి స్వాగ‌తించారు.  జస్టిస్ కె ఎం. జోసెఫ్ , జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టి ఆర్‌5 జోన్‌లో పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం శుభ‌ప‌రిణామ‌న్నారు. టీడీపీ నేత  అచ్చెన్నాయుడు పగటి కలలు కంటున్నాడ‌ని మండిప‌డ్డారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థ‌లాలు ఇచ్చి తీరుతామ‌ని స్ప‌ష్టం చేశారు.  పేద‌ల క‌ల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నెర‌వేరుస్తున్నార‌ని చెప్పారు.

Back to Top