విశాఖ ఎయిర్‌ పోర్టు ఘటనపై ఎల్లోమీడియా అసత్య రాతలు

తీవ్రంగా ఖండించిన మంత్రి బొత్స సత్యనారాయణ  

ఒక వ్యక్తే హత్యాయత్నం జరిపించుకున్నాడని రాయడం దారుణం

ఎన్‌ఐఏ రిపోర్ట్‌ ఏంటి? మీరు రాసిన రాతలు ఏంటి?

2003 అలిపిరిలో చంద్రబాబుపై హత్యాయత్నం నిజమేనా? 

వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండు

 విశాఖ ఎయిర్‌ పోర్టు ఘటనపై ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎన్‌ఐఏ రిపోర్ట్‌ ఏంటి? మీరు రాసిన రాతలేంటని నిలదీశారు. సానుభూతి కోసమే అలిపిరిలో చంద్రబాబు దాడి చేయించుకున్నారా అని ప్రశ్నించారు. తప్పుడు రాతలు, కూతలను మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం ఘటనపై క్షుణంగా దర్యాప్తు జరగాలని ఆయన డిమాండు చేశారు.
శ్రీకాకుళంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఒక వ్యక్తే హత్యాయత్నం జరిపించుకున్నాడని రాయడం దారుణమని ధ్వజమెత్తారు.   

 మంత్రి బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడారంటే..:

దుర్మార్గ రాతలు. ఖండిస్తున్నాం:
    2019 ఎన్నికల ముందు విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌గారిపై  హత్యాయత్నం జరిగింది. కోడికత్తితో వచ్చిన ఒక ఉన్మాది జగన్‌గారిని పోడిచాడు. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. వారి చేతిలో యావత్‌ పోలీస్‌ యంత్రాంగం ఉంది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ క్యాంటీన్‌ టీడీపీ సానుభూతిపరుడిది. జగన్‌గారిపై దాడి చేసిన నిందితుడు అక్కడే పని చేస్తున్నాడు. ఇది వాస్తవం. ఈ విషయాన్ని వారూ ఒప్పుకున్నారు. అయితే నిందితుడు జగన్‌గారిపై ఎందుకు దాడి చేశాడు? అందుకు ప్రేరేపించింది ఎవరు? ఇవన్నీ సందేహాత్మకంగా ఉన్నాయి.
    అందుకే మా నాయకుడిపై జరిగిన హత్యాయత్నంపై సమగ్ర దర్యాప్తు కోసం ఆరోజు నుంచి డిమాండ్‌ చేస్తున్నాం. కాగా, ఎన్‌ఐఏ నివేదికను వక్రీకరిస్తూ.. జగన్‌గారే దాడి చేయించుకున్నారంటూ ఎల్లో మీడియా విషపు రాతలు రాస్తోంది. ఆ దుర్మార్గ వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాం.

మేమూ అలా అనొచ్చా?:
    విషపు రాతలు రాస్తున్న ఆ పత్రికలను సూటిగా ప్రశ్నిస్తున్నా. చంద్రబాబుపై 2003లో అలిపిరిలో మావోయిస్టులు హత్యా ప్రయత్నం చేయడం వాస్తవమా? కాదా?. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు స్వయంగా ఆ దాడి చేయుంచుకున్నాడా? మేము ఇప్పుడు అలా అనొచ్చా? అసలు అదేనా మీ ఉద్దేశం?. మీకు కనీస ఇంగిత జ్ఞానం ఉందా? ఉచ్ఛనీచాలు ఉన్నాయా?.

హేయం. నీచాతినీచం:
    విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌గారే స్వయంగా దాడి చేయించుకున్నారని రాయాలన్న నీచమైన ఆలోచన మీ కలాలకు ఎలా వచ్చింది? ఏమిటా హేయమైన రాతలు? నిందితుడు దాడి ఎందుకు చేశాడు? అసలు ఏ ఆలోచనతో ఆ పని చేశాడనేది రాయకుండా, జగన్‌గారే స్వయంగా కోడికత్తితో పొడిపించుకున్నారు అని రాయడం నీచాతినీచం. 
    అలా రాసే అధికారం ఈనాడు పత్రికకు ఎక్కడుంది? ఇదేనా పత్రికా స్వాత్రంత్య్రం అంటే?. మా డిమాండ్‌ ఏమిటి? మీ రాతలు ఏమిటి? జగన్‌గారిపై హత్యాయత్నంపై సమగ్ర దర్యాప్తు చేయాలనేది ముందు నుంచి మా డిమాండ్‌. దాడి జరిగిన ప్రదేశం తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడిదని మీరే ఒప్పుకున్నారు. అందుకే నిందితుడికి ఆ సానుభూతిపరుడికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అన్నది తేలాలి. ఎవరి ప్రమేయంతో నిందితుడు దాడి చేశాడు? అతణ్ని ఎవరు ప్రేరేపించారనేది బయటకు రావాలి.

ఆత్మ పరిశీలన చేసుకొండి:    
    చంద్రబాబు, ఆయన కొడుకు తమ స్వార్థ రాజకీయ కోసం డ్రామాలు అడుతున్నారు. మరి మీకేమైంది? పత్రిక స్వాతంత్య్రం పేరుతో ఏమిటా నీచ రాతలు? మేం మళ్లీ డిమాండ్‌ చేస్తున్నాం. జగన్‌గారిపై హత్యాయత్నంలో వాస్తవాలన్నీ బయటకు రావాలి. లేదంటే చంద్రబాబుపై 2003లో జరిగిన హత్యాప్రయత్నం కూడా ఒక డ్రామా అని మేమూ అంటాం. అందుకే ఇలాంటి తప్పుడు రాతలు, కూతలను ఖండిస్తున్నాం.
    అసలు ఎన్‌ఐఏ కోర్టుకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఏముంది? జగన్‌గారే స్వయంగా దాడి చేయించుకున్నారని అందులో ఉందా? మరి ఆ విషయాన్ని ఎలా రాశారు? ఆ హక్కు మీకెవరు ఇచ్చారు? ఎన్‌ఐఏ ఏమన్నా రామోజీ, రాధాకృష్ణ చెవుల్లో ఆ విషయం ఊదిందా? అందుకే ఇకనైనా మీ రాతలపై ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొండి.

అనాటి నుంచి మాది అదే మాట:
    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై బీఆర్‌ఎస్‌తో పాటు, సెలబ్రిటీ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామని కేంద్రం ప్రకటించిన నాటి నుంచి మేము వ్యతిరేకిస్తున్నాం. విశాఖ ఉక్కు. ఆంధ్రుల హక్కు కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టబడుల ఉపసంహరణ చేయకూడదనేదే మా డిమాండ్‌. అందుకే సీఎంగారు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా, ప్రధానితో సహా, పెద్దలు ఎవరిని కలిసినా, అదే విషయం చెబుతున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపే ప్రయత్నం చేస్తున్నారు.
    
ఆ పార్టీల అసత్య ప్రచారాలు:
    ఇటీవల కొత్తగా పుట్టిన బీఆర్‌ఎస్‌తో పాటు, కొన్ని సెలబ్రిటీ పార్టీలు ప్రభుత్వంపై అసత్య ప్రచారంతో హడావిడి చేస్తున్నాయి. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను ప్రభుత్వం ఆపే ప్రయత్నం చేయడం లేదని నిందిస్తున్నాయి. 
    నిజానికి ప్రతిపక్షం అంటే.. వారికి రాష్ట్రం పట్ల ఒక స్పష్టమైన విధానం, చిత్తశుద్ధి, అంకితభావం ఉండాలి. అప్పుడు వారిని అఖిలపక్షంగా కేంద్రం వద్దకు తీసుకెళ్లొచ్చు. కానీ దురదృష్టవశాత్తూ ఇక్కడ విపక్షమైన తెలుగుదేశం పార్టీకి రాష్ట్రం పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదు.. ఎంతసేపూ స్వార్థ రాజకీయాలు తప్ప అని మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

Back to Top