వైయ‌స్ జ‌గ‌న్‌ రెక్కల కష్టం మీదే అధికారంలోకి వచ్చాం

చంద్రబాబుకు బీసీలంటే చిన్న చూపు

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

విజ‌య‌న‌గ‌రం:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రెక్కల కష్టం మీదే అధికారంలోకి వచ్చామ‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. గురువారం విజయనగరం జిల్లా రాజాం నియోకవర్గంలో వైయ‌స్ఆర్‌ సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా  మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. చంద్ర‌బాబుకు బీసీలంటే చిన్న చూపు అన్నారు.  టీడీపీ హయాంలో బీసీ మహిళకు మంత్రి పదవిని తీసేశారు. తాను ఏం చేశాడో చెప్పుకోలేక ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. విశాఖ రాజధాని కావాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.  టీడీపీకి జవసత్వాలు లేవన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో రుణాలు మాఫీ అంటూ చంద్రబాబు మోసం చేసాడు. ఆయన చేసిన అప్పులన్నీ తీరుస్తానని వైయ‌స్ జగన్ హామీ ఇచ్చారు.. ఇచ్చిన విధంగా తీరుస్తున్నామ‌ని చెప్పారు.  

సైకిల్ పోవాలని.. చంద్రబాబు మనస్సులో మాటని దేవుడే మాట్లాడించాడు. టీడీపీ పరిస్థితి అయిపోయింది.. జవసత్వాలు లేవు . జాకీలు, క్రేన్ లు పెట్టి టీడీపీని లేపుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మేం మూడు రాజదానులు అంటుంటే.. చంద్రబాబు అమరావతే అంటున్నారు. రాష్ట్ర సంపద 5 లక్షల కోట్లను పట్టుకెళ్ళి అమరావతిలో చుట్టాలు, బంధువులు, తాబేదార్లకు కట్ట బెట్టాలనుకుంటున్నారు.ఉత్తరాంధ్రలో ఎక్సిక్యూటివ్ క్యాపిటల్ ను కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, అశోక్ గజపతి వ‌ద్దంటున్నారు..వీరికి సిగ్గుండాలి క‌దా అని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విమ‌ర్శించారు.
 

Back to Top