కాపుల అభ్యున్నతికి వైయస్‌ జగన్‌ ప్రభుత్వం పెద్దపీట

టికెట్లు, నామినేటెడ్‌ పదవులు ప్రతీ అంశంలో కాపు సామాజికవర్గానికి ప్రభుత్వం అండగా నిలిచింది

వైయ‌స్ఆర్ కాపు నేస్తం ప‌థ‌కంతో కాపు మ‌హిళ‌ల‌కు లబ్ధి చేకూరుతోంది

సమావేశంలో చర్చించిన అంశాలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్తాం

సెలబ్రెటీ పార్టీ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం

త్వరలో విజయవాడలో కాపు ప్రజాప్రతినిధుల విస్తృతస్థాయి సమావేశం

కాపు నేతల సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ

రాజమండ్రి: కాపు సామాజికవర్గ అభ్యున్నతికి వైయస్‌ జగన్‌ ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పడానికి సంతోషిస్తున్నామని, రాజకీయపరంగా, ఏరకంగా చూసుకున్నా గత ప్రభుత్వాలతో పోల్చితే కాపు వర్గానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందనేది వాస్తవం అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజమండ్రిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కాపు సామాజికవర్గ మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వం కాపుల అభ్యున్నతి కోసం చేస్తున్న కార్యక్రమాలను సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. 

‘‘గత ప్రభుత్వాలు కాపులను ఓటు బ్యాంక్‌గా పరిగణిస్తూ, ఎన్నికలు అయిపోయిన తరువాత కాపు సామాజిక వర్గాన్ని ఎలా పక్కనబెట్టారో చూశాం. సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో కాపు సామాజికవర్గానికి గౌరవం తెచ్చే విధంగా ఉన్నామని చర్చించి సంతృప్తిని వ్యక్తపరిచాం. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం రాజకీయపరంగా, ఏరకంగా చూసుకున్నా కాపు వర్గానికి పెద్దపీట వేసిందనేది వాస్తవం. టికెట్లు, ప్రభుత్వంలో నామినేటెడ్‌ పదవులు ఇలా ఏ విషయంలోనైనా కాపు సామాజికవర్గానికి వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో పెద్దపీట వేశారని చెప్పడానికి సంతోషిస్తున్నాం. అన్ని సామాజికవర్గాలకూ ఏ విధంగా చేయూతనిస్తున్నారో.. కాపు సామాజిక వర్గం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కాపు నేస్తం అనే పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆ పథకం ద్వారా సుమారు రూ.2 వేల కోట్ల మేర కాపు మహిళలు లబ్ధిపొందారు. 

గత వారం రోజుల క్రితం సెలబ్రెటీ పార్టీ(జనసేన) సభ్యసమాజం తలదించుకునే విధంగా ఏరకంగా అసభ్యమాటలు మాట్లాడారో.. కాపు సామాజికవర్గం గురించి, కాపు శాసనసభ్యుల గురించి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకా కాపు సామాజికవర్గం అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందో, ఇక ముందు ఏయే కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో చర్చించాం. వాటన్నింటినీ సీఎం వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్తాం. అవన్నీ అమలు చేస్తే ఆర్థికంగా, సామాజికంగా, విద్య, వైద్యపరంగా అన్ని రకాలుగా కాపు సామాజిక వర్గం బాగుంటుందని సభ్యులు చెప్పిన అంశాలను క్రోడీకరించుకొని త్వరలోనే సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించాం. 

దీంతో పాటు త్వరలోనే విజయవాడలో కాపు సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, కీలక నేతలతో విస్తృత సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే ఆ తేదీని ప్రకటిస్తాం’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 

‘‘వక్రీకరించి లేనిపోని అపోహలు, ఆశలు సృషించడం కాకుండా.. రాజ్యాంగ బద్ధం, చట్టబద్ధంగా ఏ కార్యక్రమానైతే ప్రభుత్వం చేయగలదో వాటిని పదే పదే సీఎం చెప్పుకొచ్చారు. కాపు రిజర్వేషన్‌కు సంబంధించిన అంశం కేంద్ర ప్రభుత్వం ఈబీసీకి ఇచ్చిన 10 శాతాన్ని రాష్ట్రానికి సౌలభ్యం ఇస్తే.. ఈ రాష్ట్రంలో 20 శాతానికి పైబడి ఉన్న కాపులకు లబ్ధి చేకూర్చేందుకు పరిమితులను పెంచడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో ఈబీసీ పరిమితుల్లో వార్షిక ఆదాయం రూ.4–5 లక్షల ఉంటే.. మన రాష్ట్రంలో 8 లక్షల వరకు, 5 ఎకరాల వరకు పెంచాం. అగ్రవర్ణాల్లో వెనుకబడిన పేదలకు లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. 

ఏదైనా రాజకీయ పార్టీకి విధి, విధానం, సిద్ధాంతం, ఆలోచన ఉంటాయి. జనసేన పార్టీకి అవేవీ లేవు. అది సెలబ్రెటీ పార్టీ. స్వతహాగా నిలబడే పార్టీ జనసేన కాదు. నాకో 10 సీట్లు ఇవ్వండి చాలు అని చెప్పడం ఒక ఇంటర్వ్యూలో చూశాను. పది సీట్లతో పవన్‌ కల్యాణ్‌ ఏం చేస్తాడు. ఎందుకు కు్రరాళ్లను మభ్యపెడటం, ఎవరికో తాకట్టుపెట్టేందుకే కదా.. పవన్‌ కల్యాణ్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రాష్ట్రానికి, రాజకీయాలకు మంచిది. ప్రశ్నించానని చెప్పుకొని తిరగడం అంతా బోగస్‌. ఏం ప్రశ్నించాడో, ఏ అంశం మీద పోరాడాడో చెప్పమనండి’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top