త్వరలోనే ఇసుక సమస్య పరిష్కారం 

గుంటూరు నగర  అభివృద్ధి పనులలో నిర్లక్ష్యం సరికాదు

గుంటూరు నగరంలో పర్యటించిన మంత్రులు బొత్స, మోపిదేవి 

గుంటూరు : రాష్ట్రంలో త్వరలోనే ఇసుక సమస్య పరిష్కారం అవుతుందని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం పశు సంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ముస్తఫాతో కలిసి బొత్స సత్యనారాయణ గుంటూరు నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ నగరంలోని డ్రైనేజీ పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అస్తవ్యస్తంగా పనులు నిర్వహిస్తున్న అధికారులపై ఆయన ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న నగరం గుంటూరు అని, అలాంటి నగర  అభివృద్ధి పనులలో నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు. వర్షం పడితే నగరం దుర్వాసన వస్తోందని, త్వరితగతిన మార్పులు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అధికారులను ఆదేశించారు.  

Read Also: ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి

Back to Top