మీరు ఉత్తరాంధ్ర రక్షకులు కాదు... భక్షకులు

మున్సిపల్ శాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ  

 రాష్ట్రంలో డోర్ నంబర్ లేని వ్యక్తులు నీతులు చెబుతారా..? 

 విశాఖకు నెంబర్ వన్ శత్రువులు టీడీపీ నేతలే 

 ప్రజలు ఛీకొడతారని కూడా లేకుండా ఉత్తరాంధ్ర గురించి టీడీపీ నేతలు మాట్లాడటమా..? 

 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీ కనుసన్నల్లోనే జరిగిన మాట వాస్తవం కాదా..? 

 పెట్రోల్‌ ధరలు మేము పెంచామా..!? కేంద్రంలోని బీజేపీ, మోదీ పేరు ఎత్తడానికి ఎందుకు భయం? 

 గంగవరం పోర్టులో 90శాతం వాటా ప్రైవేటుది, 10 శాతం ప్రభుత్వ వాటా.. కొనుక్కుంటున్నది ప్రైవేటు.. అమ్ముకుంటున్నది ప్రైవేటు. 

విజ‌య‌న‌గ‌రం: ఉత్తరాంధ్రలో ముఖ్య పట్టణమైన, రాష్ట్రంలోనే అతి పెద్ద నగరమైన విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటిస్తే.. రెండేళ్ళుగా ప్రతిపక్ష టీడీపీ ఎందుకు అడ్డుపడుతుందో చెప్పాలని, ఇలా అడ్డుపడటం వల్ల మొత్తంగా ఉత్తరాంధ్రకు జరిగిన అన్యాయానికి క్షమాపణ చెప్పకుండా ఏ మొహం పెట్టుకుని చర్చా వేదికలు పెడుతున్నారని మున్సిపల్ శాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. విజయనగరంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. విశాఖపట్నంలో ఏ ఒక్క కార్యాలయం కూడా కట్టడానికి వీల్లేదని, రిట్ పిటిషన్లు వేసి, ఏ ఒక్క కార్యాలయం విశాఖ రాకుండా, ఇక్కడ ఏ నిర్మాణం జరగకుండా, ఉత్తరాంధ్ర అభివృద్ధికి నంబర్ 1 శత్రువులుగా నిలబడింది మీరు అవునా.. కాదా..? అని మంత్రి నిలదీశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నందుకు "పోరుబాట మీ మీద చేయాలి... మీరు పోరుబాట చేసేదేంటి.." అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కనీసం డోర్ నంబరు కూడా లేని చంద్రబాబు, లోకేష్ లు 
 
 ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదిక - పోరాటం చేస్తాం... అంటూ.. టీడీపీ చేస్తున్న హడావుడి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారనే దానిపై ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు ఏవిధంగా వ్యవహరిస్తున్నారో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సూటిగా అడుగుతున్నాం.. రాష్ట్రంలో జగన్‌ మోహన్‌ రెడ్డిగారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత 13 జిల్లాల్లో సమగ్ర అభివృద్ధి అనే నినాదంతో మూడు రాజధానులను మా విధానంగా తీసుకుని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రత్యేక నగరం అయిన విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ప్రకటిస్తే ... ప్రతిపక్షంలో ఉన్న వీళ్లు.. కోర్టుకు వెళ్లి వ్యాజ్యాలు వేశారు. విశాఖలో ఏ ఒక్క భవనం కట్టడానికి వీల్లేకుండా స్టేలు తీసుకు వచ్చారు ఇది వాస్తవం కాదా?
 మరి ఏ మొహం పెట్టుకుని ఇవాళ వచ్చి చర్చా వేదికలు, పోరాటం అని చెబుతున్నారు. అంటే ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? ప్రజలకు ఏమీ తెలియదు, అచ్చెన్నాయుడు, అశోక్‌ గజపతిరాజు వీళ్ళే మేధావులని అనుకుంటున్నారా?

 అశోక్ గజపతిరాజు.. గత ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా బీజేపీ ప్రభుత్వంలో, మోదీ కేబినెట్‌లో కేంద్రమంత్రిగా ఉన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయం మీ కనుసన్నల్లోనే జరిగిందా కాదా? మీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి? ఆరోజు మీరు ఎందుకు వ్యతిరేకించలేదు. ప్రజలు ఛీకొడతారన్న భావం కూడా లేకుండా, ఉత్తరాంధ్ర గురించి మాట్లాడతారా? 
- స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణపై కేంద్రం తీసుకున్న నిర్ణయం దురదృష్టకర నిర్ణయం. ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. విశాఖ స్టీల్ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల హక్కు మాత్రమే కాదు. ఆంధ్రప్రజల హక్కు ఇది. ఈ నినాదాన్ని మేము ముందుకు తీసుకువెళుతున్నాం.  మీరెందుకు ఆరోజు చెప్పలేకపోయారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు. మళ్లీ నంగనాచిలాగా ఉత్తరాంధ్ర అభివృద్ధి, స్టీల్‌ప్లాంట్‌ అంశం గురించి మాట్లాడటం సిగ్గుచేటు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణపై నిర్ణయం జరిగినప్పుడు కేంద్రంలో భాగస్వామ్యులుగా ఉన్న మీరా ఇప్పుడు మాట్లాడేది? స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 

  సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకురావాలన్నది స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారి ఆశయం. ఆయన చేతులు మీదగా ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశాం. తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ఏం చేసిందో చెప్పాలి? రూ.400 కోట్లు ఇచ్చామని చెప్పడానికి సిగ్గు వేయడం లేదా? నిజంగా ఈ ప్రాంతంపై అభిమానం ఉంటే చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి దీన్నిఎందుకు పూర్తి చేయించలేదు. కాగితాల మీదే ఉంచారు. గొప్పగా చెబుతున్నారు చర్చా వేదికలు, పరిరక్షణ అని చెప్పడం. ఇవాళ చెబుతున్నారు చర్చా వేదికలేంటి, ఎందుకు.. ?  అధికారంలో ఉన్నప్పుడు అందలాలు ఎక్కి ... బాధ్యతలు విస్మరించి... ప్రతిపక్షంలోకి వచ్చాక మాటలే తప్ప చేతలు మనుషులు కాదని ప్రజలు గుర్తించే వైయస్సార్‌ సీపీకి పట్టం కట్టారు. 

 మాకు బాధ్యత, పట్టుదల ఉంది. ఇచ్చిన మాట నెరవేర్చాలనే దృక్పదంతో ముందుకు వెళుతున్నాం. గంగవరం పోర్టు పదిశాతం వాటా అమ్మకాలు చేశారంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. పారిశ్రామిక విధానాలు, ఒప్పందాలు ఏవిధంగా ఉంటాయో మీకు తెలుసు. ప్రజలను మభ్యపెట్టి రాజకీయలబ్ది పొందాలనేది అన్నివేళలా చెల్లదు.

  • - గంగవరం పోర్టు ప్రయివేట్‌ సంస్థ. 90శాతం వాటా ప్రయివేటుది. 10 శాతం ప్రభుత్వ వాట. దాని ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందో అది మీకు తెలుసు. 
  • -  10 శాతం ప్రభుత్వ వాటాకుగానూ, రాష్ట్ర ప్రభుత్వానికి గత 5 ఏళ్ళలో వచ్చింది దాదాపు రూ. 80 కోట్లు. 
  • - వచ్చే 5 ఏళ్ళలో డివిడెండ్ గా ఒక్క రూపాయి కూడా రాదు. 
  • - ఎందుకు రాదు అంటే.. కొనుగోలు చేసినవారు ఉన్న పోర్టును విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి. 
  • - పోర్టును విస్తరిస్తే.. అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం కూడా తన ఈక్విటీ ప్రకారం భరిస్తే, మళ్ళీ కొన్ని వందల కోట్లు దాని మీద పెట్టాలి.  అలా పెట్టే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. అలా పెడతాం అన్నా.. అప్పుడూ అదానితో కుమ్మక్కు అయ్యి డబ్బులు పెట్టాం అంటారు. 
  • - అంటే ఈక్విటీ పెట్టే పరిస్థితీ లేదు. డివిడెండ్ వచ్చే పరిస్థితీ లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ పోర్టులో ఉన్న వాటాను ఉంచాలా.. వద్దా... అన్నది ఆలోచించి ఉపసంహరణే మంచిదని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. 
  • - ఇది తప్పు అనుకుంటే, చంద్రబాబు నాయుడు, ఇలా 58 సంస్థల్ని 1999-2004 మధ్య అమ్మేయడం కరెక్టో.. తప్పో చెప్పాలి.
  • - ఒకవేళ నష్టాలు వస్తే భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకే ప్రభుత్వ వాటా అమ్మేయడం జరిగింది. లాభదాయకంగా ఉంటుందనే ఈ పదిశాతం ఇవ్వడం జరిగింది. పది శాతం ఇచ్చాం కానీ, ఒరిజినల్‌గా ఉన్న ఒప్పందం ప్రకారం ఏదైతే 33ఏళ్లు తర్వాత ప్రభుత్వానికి ఇవ్వాల్సిన భూములు అలాగే ఉంటాయి. ఆ ఒప్పందానికి చిన్నమెత్తు తేడా లేదు. 

 రాష్ట్ర శ్రేయస్సుకు పనికి వచ్చే నిర్ణయాన్నే మేము తీసుకుంటాం. ఆ నిర్ణయాన్నే ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకసారి గుండె మీద చేయివేసుకుని చెప్పండి మీరు. పెట్రోలు ధరలపై ధర్నాలు చేస్తున్నారు. పెట్రో ధరలు పెరగడంపై మాకూ బాధగానే ఉంది. ప్రభుత్వం, ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా పెంచుతున్న పెట్రోల్‌, డీజిల్, గ్యాస్ ధరల వల్ల  మేం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. 

  • -"పెట్రోల్‌ ధరలు తగ్గాలంటే జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలో నుంచి దిగిపోవాలట. ఎందుకు మళ్లీ రాష్ట్రాన్ని దోచుకుపోయేందుకా?." 
  • - రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా దెబ్బతిని చిన్నాభిన్నం అయిందని రోజూ కొన్ని పత్రికలు డప్పేసి చెబుతున్నాయి. రూ. 2లక్షల 50వేల కోట్లు టీడీపీ హయాంలో అప్పులు చేశారు. వాటిలో ప్రజలకు ఎంత లబ్ది చేకూరిందో చెప్పాలి. మీ ప్రభుత్వ హయాంలో ఏం ఆస్తులు సమకూర్చారో చెప్పాలి.
  • -  చంద్రబాబు చేసిన అప్పు గురించి చెప్పమనండి. ఆ అప్పు తెచ్చి ఏంచేశారో చెప్పాలి. మేం చేసిన అప్పుల్లో నవరత్నాలకే కాకుండా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం, ఆర్బీకేలు, ఏర్పాటు చేస్తున్నాం. ప్రజల గుమ్మం వద్దకే పాలన తీసుకు వస్తున్నాం. మరి చంద్రబాబుఏం చేశాడో చెప్పమనండి. 
  • - అవును ఈ రెండేళ్లలో మేం అప్పు చేశాం. చేసిన అప్పును సుమారు రూ. లక్షా 10వేల కోట్లు సంక్షేమ కార్యక్రమాల ద్వారా డైరెక్ట్‌ గా ప్రజల బ్యాంక్‌ అకౌంట్‌ లలో జమ చేశాం. మరో రూ. 36 వేల కోట్లు నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు అందజేశాం. ప్రజల సంక్షేమం కోసం అప్పులు చేశాం. కరోనా వల్ల అల్లాడిపోయిన తరుణంలో డీబీటీ ద్వారా జగన్‌ మోహన్‌ రెడ్డిగారి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో పేద ప్రజలకు లక్ష కోట్ల రూపాయలు పైచిలుకు పంపిణి చేసి వారిలో కొనుగోలు శక్తిని పెంచి, వారికి స్థైర్యాన్ని అందించి, ఆ కుటుంబాలను ఆదుకున్నాం.
  • - అప్పు చేశామని సిగ్గుపడటం లేదు. దాన్ని సక్రమంగా వినియోగించామని చెబుతున్నాం.
  • - ఎస్సెట్స్‌ కు వస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఒకపక్క నాడు-నేడు ద్వారా పాఠశాలలు ఆధునీకరణ, హెల్త్‌ క్లినిక్‌ లు ఆధునీకరణ, రైతు భరోసా కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, జిల్లాకో మెడికల్‌ కాలేజీ, ఉన్న ఆస్పత్రులను అప్‌గ్రేడ్‌ చేస్తూ నియోజకవర్గాల్లో వంద పడకలకు మార్చడం. ఇవన్నీ ఎసెట్స్‌ కాదా? ఇవన్నీ మీ హయాంలో ఎందుకు చేయలేకపోయారు?

 బాబు అప్పు తెచ్చిన రూ. 2 లక్షల కోట్లు ఏం చేశాడు..? 
 రెండు లక్షల కోట్లు అప్పులు తెచ్చిన చంద్రబాబు ఏం చేశారో చెప్పండి అచ్చెన్నాయుడు గారూ.. ఇవాళ చంద్రబాబు నాయుడు ఉద్యమం చేయమంటే.. చేయండి తప్పులేదు. అందరికీ ఆమోదయోగ్యమో.. కాదో గుర్తించండి. పెట్రో ధరలపై నిరసన తెలపండి మాకేమీ అభ్యంతరం లేదు. పెట్రోల్‌ ధరలు మేము పెంచామా?. కేంద్రంలోని బీజేపీ, మోదీ పేరు ఎత్తడానికే మీరు ఎందుకు భయపడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం.
-  అధికారంలో ఉన్నప్పుడు విలాసవంతమైన సోకుల కోసం అనుభవించి, ఇవాళ ప్రతిపక్షంలోకి రాగానే లేనిపోని అవాకులు, చవాకులు పేలుతూ రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ఉత్తరాంధ్ర రక్షకులు కాదు... ఉత్తరాంధ్ర భక్షకులు. - టీడీపీ హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఫలానా కార్యక్రమం చేశామని గుండెలమీద చేయి వేసుకుని చెప్పమనండి. కేంద్రమంత్రిగా పనిచేసిన అశోక్‌ గజపతిరాజు ఏం చేశారో చెప్పాలి. వచ్చిన విమానాశ్రయాన్నే అడ్డుకునేందుకు ప్రయత్నించారు ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమా? ఏది మీ మార్కు పాలన?

  టీడీపీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు అడుగుతారనే ఇంగిత జ్ఞానంతో కాస్త పునరాలోచించుకోండి. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వండి. మాకేమీ అభ్యంతరం లేదు. పేద ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే,  విశాఖలో ఇళ్ళ పట్టాలకు ల్యాండ్‌ పూలింగ్‌ లో భూములు సేకరిస్తుంటుంటే.. దానిమీద స్టే తీసుకువచ్చి ఆపేశారు. వేలాదిమంది పేదలకు ఇళ్లు ఎలా ఇస్తామనుకుంటున్నారు. మీకు సిగ్గుందా? నిజంగానే ప్రభుత్వం బలవంతంగా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుందని వారు కోర్టుకు వెళితే బాగుండేది. అలా కాకుండా సంబంధం లేని వ్యక్తి న్యాయస్థానికి వెళ్లడం ఎంతవరకూ సమంజసం. మీకు సిగ్గుందా?

 మూడు రాజధానుల అంశంలో న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తాం.. 
 మూడు రాజధానులకు మేము కట్టుబడి ఉన్నాం. ఏదైనా అంశం ఉంటే చర్చలు. మేం చేస్తుంది జరగాలంటే చర్చేంటి? కొన్ని గ్రామాలకో, ఓ సామాజిక వర్గానికో న్యాయం చేయడం కాదు. రాష్ట్ర ప్రజలందరికి సమాన న్యాయం, అభివృద్ధి చేయాలన్నదే మా ప్రభుత్వ విధానం, మా నిర్ణయం మాకు ఉంది. ఏరోజు అయితే శాసనసభలో చట్టం చేశామో, సీఎం ప్రకటించారో ఆక్షణం నుంచే మూడు రాజధానుల నిర్ణయం అమలు జరిగింది. అయితే అందుకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు అధిగమిస్తాం. ప్రభుత్వ విధానం మాకు ఉంటుంది.

 ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు ఎక్కడ ఉన్నారు? వాళ్లు ఎక్కడ ఉండాలో చెప్పమనండి. ఆయన ఇంటి డోర్‌ నంబర్‌ చెప్పమనండి. పక్క రాష్ట్రంలో ఉండి కుటుంబంతో ఎంజాయ్‌ చేస్తూ ... ఇక్కడకు వచ్చి మొసలి కన్నీరు కారుస్తారా?
-ఉమ్మడి రాజధాని పదేళ్లు ఉన్నా పారిపోయి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు నీతులు మాట్లాడతారా?

 అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రభుత్వ ఖజానా నుంచి ఇప్పటికి రెండు విడతలుగా దాదాపు రూ.900కోట్లు ఇచ్చింది, ఇది వాస్తవం కాదా?. అగ్రిగోల్డ్‌ ఆస్తులను మేము వాడుకోవడం ఏంటి? బోడి గుండుకు మోకాలుకు ముడిపెట్టినట్లు ఉంది. 
-భోగాపురం విమానాశ్రయం నిర్మాణం త్వరలో ప్రారంభం అవుతుంది. నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తాం.
-ఆంధ్రా-ఒడిశా సరిహద్దులకు సంబంధించి అంతర్‌ రాష్ట్రాల వివాదం ఉంది. మనకున్న హక్కుల ప్రకారం సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటాం. అంతేతప్ప దూకుడుగా వ్యవహరించడం జరగదు.
-ప్రభుత్వం అంటే.. ఏ కార్యక్రమం చేసినా నూటికి నూరు శాతం ఆమోదించకపోవచ్చు కానీ, 90 శాతం మంది ఆమోదించే నిర్ణయాన్నే అమలు చేస్తాం. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోం.

తాజా వీడియోలు

Back to Top