అన్ని ప్రాంతాల‌ను అభివృద్ధే సిఎం వైయ‌స్‌ జగన్ అభిమతం  

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

రాష్ట్రానికి ఏ క్షణమైనా మూడు రాజధానులు ఏర్పాటు కావచ్చు

రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటూ టీడీపీ నేత‌ల పైశాచిక ఆనందం

తాడేప‌ల్లి:  అన్ని ప్రాంతాలను అభివృద్ధి ‌చేయడం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభిమ‌త‌మ‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. అందుకే మూడు రాజధానులపై చట్టం చేశారని తెలిపారు.  మూడు రాజధానుల చట్టం చేసినప్పటి నుంచే ప్రక్రియ ప్రారంభమైందని.. ఏ రోజైనా, ఏ క్షణమైనా ఇది జరుగచ్చని వ్యాఖ్యానించారు. గురువారం సీఎం క్యాంపు కార్యాల‌యం వ‌ద్ద మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. 
సీఎం వైయ‌స్ జగన్ పేదలందరికీ ఇళ్లు ఉండాలని 30 లక్షల మందికి ఇళ్ల‌స్థలాలు ఇచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. వాటిలో ఇళ్ల నిర్మాణంకు సిఎం వైయ‌స్ జగన్ శంకుస్థాపన చేశారని..ఆ కాలనీలకు అన్ని మౌలిక‌ సదుపాయాలు కల్పించనున్నారని వెల్లడించారు. కేంద్రం ఇంటి నిర్మాణానికి నిధులు కల్పిస్తుందని…భూ కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పన రాష్ట్రం చేస్తోందన్నారు. నిర్మాణానికి అవసరమైన మెటీరియల్స్ ను తక్కువ ధరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించే చర్యలు తీసుకుందని తెలిపారు. 
రాజ్యాంగం, చ‌ట్టానికి అనుగుణంగా మూడు రాజ‌ధానులు
 రాజ్యాంగం, చట్టానికి అనుగుణంగా మూడు రాజధానులు ‌చేస్తామని…టిడిపి వారు రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అనుకుంటారని..వారిది పైశాచిక ఆనందం అని మంత్రి ఫైర్ అయ్యారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ క్షణమైనా మూడు రాజధానులు ఏర్పాటు కావచ్చని మంత్రి  తెలిపారు. ఈ ఏడాదని కాకుండా ఏ క్షణమైనా ఈ రాజధానులు ఏర్పాటు అవుతాయని ఆయన పేర్కొన్నారు. వీటికి సంబంధించిన పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. మూడు రాజధానుల ఏర్పాటును కొంత మంది దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయని మంత్రి మండిప‌డ్డారు. శాసనసభలో ఏ చట్టం చేశామో అదే జరిగి తీరుతుందని బొత్స స్పష్టం చేశారు. మూడు రాజధానుల ఏర్పాటు తరువాత సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయవచ్చని మంత్రి బొత్స పేర్కొన్నారు.  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స పేర్కొన్నారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top