100 శాతం వైయ‌స్ఆర్‌ ‌సీపీ ఘన విజయం

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది

 మంత్రి బొత్స సత్యనారాయణ

  తాడేపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో 100 శాతం వైయ‌స్ఆర్‌ ‌సీపీ ఘన విజయం సాధించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందని తెలిపారు. సీఎం వైయ‌స్ జగన్ పాలనకు ప్రజలు పట్టం కట్టారని చెప్పారు.22 నెలల సంక్షేమ సీఎం పాలనకు ప్రజలు ఘన విజయం అందించారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పనిచేసే ప్రభుత్వానికి, నిజాయితీ, నిబద్ధతకు ప్రజలెప్పుడూ మద్దతు ఇస్తారని వ్యాఖ్యానించారు. ఎక్కడా ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ ప్రజల వద్దకు వెళ్తున్నామని చెప్పారు.

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా, దౌర్జన్యాలు చేసినా ప్రజలు వైయ‌స్సార్‌సీపీనే నమ్మారని తెలిపారు. ఏ సమస్య వచ్చినా స్పందిస్తున్నామని, ప్రజలపై తనకు నమ్మకం ఉందని వైయ‌స్ జగన్ చెప్పారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని చేసినా ప్రజలు తమవైపే ఉన్నారని సీఎం చెప్పారని వ్యాఖ్యానించారు. ఈ విజయాన్ని ఇచ్చిన పట్టణ ప్రాంత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

రానున్న రోజుల్లో ఇంకా బాధ్యతగా పని చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మేయర్, చైర్మన్ ఎంపిక పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్ నిర్ణయిస్తారని చెప్పారు. టీడీపీని ఒక సామాజికవర్గ పార్టీగా మారుస్తున్నారని సొంత పార్టీ వారే అంటున్నారని తెలిపారు. మాయ మాటలు, మోసం చేసే వ్యక్తికి ఓటు ఎలా వేస్తారని అన్నారు. అమరావతి, విశాఖ ఉక్కు అంటూ బాబు రాజకీయం చేయబోయాడని అందుకే ప్రజలు ఆయన ఆలోచనకు బుద్ధి చెప్పారని తెలిపారు. తండ్రీకొడుకులు ఎలా మాట్లాడారో రాష్ట్రమంతా చూశారని  బొత్స మండిపడ్డారు.

తాజా ఫోటోలు

Back to Top