చంద్రబాబు చరిత్ర ముగిసింది

మంత్రి బొత్స సత్యనారాయణ
 

అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ జీవితం, చరిత్ర అంతా కూడా ముగిసిన అధ్యాయమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆయన జీవితమంతా కుట్రలే అన్నారు. ఇక ఆయన కుట్రలు సాగవని హెచ్చరించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. మండలిలో ప్రతిపక్ష టీడీపీ ఏదో చేయాలని తహతహలాడిందన్నారు. చంద్రబాబు అనుకున్నవన్నీ జరగవన్నారు. యనమల రామకృష్ణుడు విధ్వంసాలు సృష్టిస్తామంటారు..చంద్రబాబు కుమారుడు లోకేష్‌ సభలో వీడియోలు తీస్తారు. ఇదంతా వ్యూహాత్మకంగా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు. గవర్నర్‌ ప్రసంగం వినకుండానే చంద్రబాబు ఆ రోజు పారిపోయారు. బిల్లులు పెడితే మీ సంఖ్యను బట్టి మీ అభిప్రాయాలను చెప్పే బాధ్యత చంద్రబాబుకు ఉంది కదా? ఆ రోజు గవర్నర్‌ ప్రసంగాన్ని వినే ఓపిక లేక, అసహనంతో వెళ్లిపోయావు. సంఖ్య బలం ఉంటే ఓడించవచ్చు కదా? .  పద్ధతి ప్రకారం వ్యవహరించడం చంద్రబాబుకు ఇష్టం ఉండదు. ఆయన జీవితమంతా కూడా కుట్రలు, కుతంత్రాలేని మండిపడ్డారు.
 

Back to Top