నవరత్నాలే వైయస్‌ఆర్‌ సీపీని గెలిపిస్తాయి

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
 

విజయనగరం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థులను గెలిపిస్తాయని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నవరత్నాల ఫలాలు ప్రతి ఒక్కరూ రుచి చూస్తున్నారన్నారు. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారని చెప్పారు. ఇంటి వద్దకే వెళ్లి అవ్వాతాతలకు పెన్షన్‌ డబ్బులు ఇస్తున్నామని, చిన్నారుల చదువుకు అమ్మ ఒడి ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నామని, రైతు భరోసా ద్వారా అన్నదాతలకు చేయూతను అందిస్తున్నామని, ఆటో డ్రైవర్లు, చేనేతలు, మత్స్యకారులకు కూడా ఆర్థిక సాయం అందజేశామన్నారు. అదే విధంగా దశలవారి మద్య నిషేధం పథకం ద్వారా మహిళలు కూడా సంతోషంగా ఉన్నారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top