ఉత్తరాంధ్రపై విషం చిమ్మేందుకే విశాఖకు చంద్రబాబు

ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి

ఎక్కడ ఏ సంఘటన జరిగినా పులివెందులపై నెపం

చంద్రబాబు బుద్ధి మారడం లేదు

కుప్పానికి నీరు ఇవ్వకుండా మాపై నిందలా?

మంత్రి బొత్స సత్యనారాయణ

చిత్తూరు: ఉత్తరాంధ్ర ప్రజలపై విషం చిమ్మేందుకే నిన్న చంద్రబాబు విశాఖ పర్యటనకు వచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. చంద్రబాబు తీరు మార్చుకోకపోతే నిన్నటి ఘటనే రిపీట్‌ అవుతుందని హెచ్చరించారు. విశాఖ ప్రజల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని మండిపడ్డారు. చిత్తూరులో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.  చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పానికి తాగునీరు ఇవ్వలేక మాపై నిందలు వేయడం సరికాదన్నారు. వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు చంద్రబాబు విశాఖ వెళ్లారు. ఆ సమయంలో విశాఖ ప్రజల్ని కించపరుస్తూ చంద్రబాబు మాట్లాడటం తగదు. నిన్న విశాఖలో చంద్రబాబు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని మేం చూస్తుంటే..చంద్రబాబు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. వెనుకబడిన ప్రాంతాలను సీఎం వైయస్‌ జగన్‌ అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు నీతులు చెబుతారు..అధికారం లేకపోతే క్షుద్రభావనతో, కుత్సితబుద్ధితో మాట్లాడుతారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో చంద్రబాబుకు ప్రజలు ఐదేళ్లు అధికారం ఇస్తే ఏం చేశారు?. రూ.1.95 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. ఇవాళ రాష్ట్రానికి అప్పులు పుట్టలేని స్థితికి తీసుకెళ్లారు. ఇవాళ ఆయనే మాట్లాడుతున్నారు. నిన్న చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి మాట్లాడిన మాటలు బాధాకరం. నిన్నటి ఘటనకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. వైయస్‌ఆర్‌సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో కాపు ఉద్యమం జరిగింది. ఆ సమయంలో ఎవరో రైలుకు నిప్పంటిస్తే దాన్ని వైయస్‌ఆర్‌సీపీకి అంటగట్టారు. పులివెందులకు ఆపాదించారు. ఎక్కడ ఏమి జరిగినా ఒక్కటే క్యాసెట్‌ వేస్తారు. తుని ఘటనపై సీఎంగా ఉన్న చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదు?. నాపై కూడా మొదటి ముద్దాయిగా కేసు పెట్టారు. చంద్రబాబు అంతే..ఆయన బుద్ధి మారడం లేదు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో పాటు పోతుందని మా జిల్లాలో సామెత ఉంది. చంద్రబాబు బుద్ధఙ కూడా అలాంటిదేనని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.
 

తాజా వీడియోలు

Back to Top