విజయవాడ: అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. విజయవాడ నగరంలోని కృష్ణలంకలో రిటైనింగ్ వాల్‌కు ప్రభుత్వం రూ.126 కోట్లు కేటాయించింది. దీంతో సోమవారం సీఎం వైయస్ జగన్‌కు కృష్ణలంక ప్రజలు కృతజ్ఞతా ర్యాలీ నియోజకవర్గ సమన్వయకర్త అవినాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి మాట్లాడుతూ..కృష్ణలంకలో చిన్న వర్షం కురిసినా, వరదలు వచ్చినా పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది. మీ ఆవేదన, బాధను సీఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. వరదల సమయంలో విజయవాడకు సంబంధించిన పరిస్థితులను సీఎంకు వివరించాం. వెంటనే సీఎం ఇందుకోసం నిధులు కేటాయించారు. రిటైనింగ్ వాల్‌కు రూ.126 కోట్లు కేటాయించారు. చాలా మంది నాయకులు వచ్చి మాటలు చెప్పారు కానీ..పనులు చేయలేదు. వైయస్ జగన్ మాట ఇస్తే..మడమ తిప్పడు. విజయవాడ నగరాన్ని సీఎం వైయస్ జగన్ అన్ని విధాలా ఆభివృద్ధి చేస్తారు. పేదల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. పింఛన్లు ఇంటి వద్దకే తీసుకొచ్చి ఇచ్చారు. పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి కార్యక్రమాన్ని చేపట్టి చేసి చూపించారు.గతంలో సంక్షేమ కార్యక్రమాలు మధ్యవర్తులు, దళారులకు పండుగగా ఉండేది. ఈ పరిస్థితిని వైయస్ జగన్ మార్చేశారు. ఈ ప్రభుత్వానికి మీ దీవెనలు, ఆశీస్సులు ఇవ్వండి. విజయవాడలో అవినాష్ యువకుడు..మీకు అండగా ఉంటారు. వాళ్ల నాన్న మాదిరిగానే అంకితభావంతో పని చేస్తారు. మీరంతా తోడుగా ఉండాలి.