చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే..

మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

అసెంబ్లీ: రాజధానిపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు గంటకో మాట మారుస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మాట మాట్లాడితే చంద్రబాబు హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టాను. హైటెక్‌సిటీ నేనే కట్టాను. ఎయిర్‌పోర్టు నిర్మించానని చెబుతున్నాడని, హైటెక్‌ సిటీకి ఎన్‌.జనార్దన్‌రెడ్డి ఫౌండేషన్‌ వేశారన్నారు. ఔటర్‌రింగ్‌ రోడ్డు ఎవరు కట్టారో ప్రజలందరికీ తెలుసన్నారు. చంద్రబాబు సభలో వాస్తవాలు మాట్లాడితే దానికి సమాధానం చెప్తామన్నారు. సింగపూర్‌ కంపెనీలు ఇప్పటి వరకు మూడు సార్లు వచ్చి వెళ్లారని, ప్రజంటేషన్‌ ఇవ్వమని అడిగితే.. సింగపూర్‌ ప్రతినిధులు ప్రజంటేషన్‌ ఇవ్వకుండా వెళ్లిపోయారన్నారు. సింగపూర్‌తో చంద్రబాబు చేసుకున్న ఒప్పందాలు లోపభూయిష్టంగా ఉన్నాయన్నారు.

Back to Top