పేదల ఇళ్ల నిర్మాణంలోనూ దోచుకుతిన్నారు

ఐదేళ్లలో టీడీపీ ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదు

హౌసింగ్‌పై రెండు టెండర్లలో రివర్స్‌టెండరింగ్‌ ద్వారా రూ.150 కోట్లు ఆదా

అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించి  ఉచితంగా ఇస్తాం

మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖమంత్రి బొత్స సత్యనారాయణ

అసెంబ్లీ: ఇళ్ల పేరుతో గత ప్రభుత్వం విపరీతమైన దోపిడీకి పాల్పడిందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పేదవాడి ఇళ్లలో కూడా దోపిడీ చేసి వారిపై రూ.3 లక్షలకుపైగా భారం మోపాలను చూసిందన్నారు. ఈఎంఐల పేరుతో ఆ పేదవాడు 20 సంవత్సరాలు పాటు తన కష్టార్జీతాన్ని కట్టే పరిస్థితిని నెలకొల్పారన్నారు. కానీ, సీఎం వైయస్‌ జగన్‌ ఆ పరిస్థితిని రూపుమాపారని, పేదవారి కోసం కడుతున్న ఇళ్లను రివర్స్‌టెండరింగ్‌కు తీసుకెళ్లి ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ఆదా చేయడమే కాకుండా లబ్ధిదారుడికి ఇళ్లు ఉచితంగా ఇవ్వాలని ఆదేశించారన్నారు.

అసెంబ్లీలో మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు.. 300 చదరపు అడుగుల ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, కేంద్రప్రభుత్వం రూ.1.50 లక్షలు ఇస్తే రూ.2.65 లక్షలు లబ్ధిదారుడు లోన్‌ కింద ఒక ఇంటికి ఇవ్వాలనేది గత ప్రభుత్వ స్కీమ్‌.
345 అడుగుల ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, లబ్ధిదారుడు వచ్చి రూ.3.15 లక్షలు ఇవ్వాలి. 430 అయితే కేంద్రం రూ.1.50, రాష్ట్రం రూ.1.50 లక్షలు కాకుండా లబ్ధిదారుడు రూ.3.65 లక్షలు ఇవ్వాలి.
 
7 లక్షలు ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వం శాంక్షన్‌ తీసుకొచ్చి అందులో 5 లక్షల ఇళ్లను నిర్మించాలనుకొని అందులో 3,09,432 ఇళ్లు మాత్రమే టెండర్లు పిలిచారు. అందులో 77,371 మాత్రమే 90 శాతం పూర్తయ్యాయి. ఐదేళ్ల కాలపరిమితిలో అత్యంత ప్రాధాన్యత అని చెప్పుకున్నారో.. కార్యక్రమంలో 90 శాతం మాత్రమే 77,321 ఇళ్లను పూర్తి చేశారు. దీంట్లో లబ్ధిదారుడు డబ్బుకట్టుకోవాలి.

మామూలుగా ఇటికలతో కాకుండా కొత్తగా షేర్‌వాల్‌ టెక్నాలజీని తీసుకువచ్చారు. త్వరితగతిన కట్టి ఇవ్వాలనేది వారి ఉద్దేశం. ఉద్దేశం బాగున్నా.. ఐదేళ్ల కాలంలో ఒక్క ఇల్లు కూడా పూర్తిచేసి ఇవ్వలేదు. కూలిపని చేసుకొని తిండిలేక సొంత ఇల్లు ఉండాలని కలలు కనే పేదవాడి కోసం షేర్‌వాల్‌ టెక్నాలజీతో 300 చదరపు అడుగులో కడుతున్న ఇంటికి రూ.16 వందల నుంచి రూ.1851. అదే 345 ఎస్‌ఎఫ్‌టీ అయితే రూ.1539 నుంచి రూ.1773, అదే 430కి అయితే రూ.1481 నుంచి రూ.1724 చదరపు అడుగు నిర్మాణానికి ఈఎంఐ 20 ఏళ్ల పాటు తిన్నా.. తినకపోయినా ఆ పేదవాడు కడుతూనే ఉండాలి. 300 చదరపు అడుగుకు లబ్ధిదారుడి నుంచి రూ.2.65 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇదంతా మా నాయకుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు, ఎన్నికల ప్రచారం ప్రజలంతా చెప్పారు. ఇందులో అవినీతి, దోపిడీ జరిగిందని, మేము అధికారంలోకి వచ్చిన తరువాత సమగ్రంగా పరిశీలించి రివర్స్‌టెండరింగ్‌ చేస్తామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు.

రివర్స్‌టెండరింగ్‌లో పాలరాతి, సింకులు, గ్రానైట్‌లు తీసేశారని ప్రతిపక్ష సభ్యులు అంటున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన వాటిని కామా, పులిస్టాప్‌ మార్చకుండా టెక్నాలజీ కూడా మార్చకుండా రివర్స్‌టెండరింగ్‌కు వెళ్లాం. విశాఖ, చిత్తూరు, కృష్ణా, విజయనగరంలో సుమారు 14368 ఇళ్లకు రీ టెండర్లకు వెళితే.. దాని ఖర్చు రూ.707 కోట్లు అయితే రివర్స్‌టెండరింగ్‌లో రూ.601 కోట్లకు కోట్‌ చేశారు. అంటే రూ.106 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యింది.

సీఎం వైయస్‌ జగన్‌ ఒక మాట చెప్పారు. పేదవారి కోసం కడుతున్న ఇళ్లు ఉన్నాయో.. గత ప్రభుత్వం అవినీతి చేసింది. వాటిపై రివర్స్‌టెండరింగ్‌కు వెళ్లిన తరువాత 300 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్లులను ఉచితంగా ఇద్దాం.. ఒక్క పైసా కూడా లబ్ధిదారుడి దగ్గర తీసుకోవద్దని చెప్పారు. ఇప్పుడు 300 చదరపు అడుగులో కట్టిన ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా ఇస్తాం. ఒక టెండర్‌లోనే రూ.106 కోట్లు ఆదా అయ్యింది. రెండోసారి 6496 ఇళ్లకు టెండర్లు పిలిచాం. దాని అగ్రిమెంట్‌ కాస్టు రూ.317 కోట్లకు రూ.271 కోట్లు కోట్‌ చేస్తే దాంట్లో రూ.46 కోట్లు ఆదా అయ్యింది. రెండు టెండర్లలో రూ.150 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యింది.

గత ప్రభుత్వంలో పెద్ద పెద్ద కంపెనీలు టెండర్లలో పాల్గొన్నారు. వారంతా 5 శాతం ఎక్కవకు కోట్‌ చేశారు. ఆ 5 శాతం, ఇప్పుడు 15 శాతం తక్కువ.. అంటే మొత్తం 20 శాతం గత ప్రభుత్వం దోచుకుతిన్నది. వాస్తవానికి 3 లక్షల ఇళ్లకు రివర్స్‌టెండరింగ్‌కు వెళితే సుమారు రూ.2626 కోట్లు ఆదా అయ్యేవి. ఇప్పుడు ఒక్క ఇంటికి రూ.75 వేలు ఆదా జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలు పంచభూతాలను పంచుకుతిన్నారు. 5 లక్షల ఇళ్లకు టెండర్లు పిలిచి ఉంటే రూ.4250 కోట్లు వీళ్ల దోపిడీకి పాల్పడేవారు. ప్రతిపక్షం సత్యదూరమైన మాటలు మాట్లాడుతుంది. ప్రతిపక్షం దగ్గర ఆధారాలు ఉంటే ఏ శిక్ష వేసినా శిరసావహిస్తాను. ఫర్నీచర్‌ అంటే మంచం, కుర్చీ, సోఫా వీటిని ఫర్నీచర్‌ అంటారు. ఇవన్నీ టీడీపీ ఇస్తుందా.. చెప్పమనండి వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోతా అని మంత్రి బొత్స సత్యనారాయణ సవాలు విసిరారు.

 

Back to Top