కౌలు రైతులకు కూడా ‘వైయస్‌ఆర్‌ రైతు భరోసా’ వర్తింపు

మంత్రి బొత్స సత్యనారాయణ
 

విజయవాడ: రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ప్రభుత్వం వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం వర్తింపజేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. గతంలో టీడీపీ ప్రభుత్వం పంట రుణాలు బేషరత్తుగా మాఫీ చేస్తామని మాట ఇచ్చి తప్పందిందన్నారు. మాది రైతు ప్రభుత్వం కాబట్టి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నామన్నారు. రైతులు లక్ష రూపాయల పంట రుణం తీసుకుంటే సున్నా వడ్డీ పథకం వర్తిస్తుందని, రూ.3 లక్షల వరకు రుణం తీసుకుంటే పావలా వడ్డీకే రుణాలు ఇస్తుందన్నారు. గతంలో కౌలు రైతులకు రూ.5 వేల కోట్లు రుణాలు ఇస్తే..మా ప్రభుత్వం రూ.8 వేల కోట్లు ఇవ్వాలని టార్గెట్‌గా పెట్టుకున్నామన్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారుల సర్వే ప్రకారం కౌలు రైతుల లెక్కలు ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు. కౌలు రైతుతో పాటు రైతుకు కూడా రూ.12,500 ఇస్తామన్నారు. కేంద్రం ప్రభుత్వం నుంచి వచ్చేది ఇందులో ఉండదన్నారు. 

 

తాజా ఫోటోలు

Back to Top