గతంలో ఉన్న విద్యుత్‌ చార్జీలనే అమలు చేస్తున్నాం

కరెంట్‌ చార్జీలపై టీడీపీ దుష్ప్రచారాన్ని ఖండించిన మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి

ప్రకాశం: గతంలో ఉన్న విద్యుత్‌ చార్జీలనే అమలు చేస్తున్నామని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. విద్యుత్‌ చార్జీలు పెంచారంటూ ప్రతిపక్షం చేస్తున్న విషప్రచారాన్ని మంత్రి బాలినేని తీవ్రంగా ఖండించారు. విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకొని తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని, గతంలో ఉన్న విద్యుత్‌ చార్జీలనే ప్రస్తుతం అమలు చేస్తున్నామన్నారు. శ్లాబుల ధరలు ఎక్కడా పెంచలేదన్నారు. విద్యుత్ బిల్లులు ఎక్కువ రావ‌డంతో ప్రజల్లో  అపోహ‌లు నెల‌కొన్నాయ‌ని, మూడు నెలల బిల్లు ఒకేసారి కట్టాల్సి రావడం వల్లే ఎక్కువ బిల్లు వచ్చినట్లు కనిపిస్తోందన్నారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో విద్యుత్ వినియోగం ఎక్కువ‌గా జరిగిందని, దీంతో బిల్లులు పెరిగాయ‌న్నారు. విద్యుత్‌ చార్జీలపై సంబంధిత అధికారులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారన్నారు. 
 

Back to Top