తాడేపల్లి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని వైయస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్‌గా తాను శ్రీవారి నిధులను ఆదా చేయడానికి, భక్తులకు మరింతగా సేవలు అందించడానికే పెద్దపీట వేశానని తేల్చి చెప్పారు. రాజకీయ కుట్రతోనే సీఎం చంద్రబాబు శ్రీవారి లడ్డూ ప్రసాదానికి అపవిత్రత ఆపాదించేలా దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా బాధ్యత గల పద విలో ఉన్న సీఎం చంద్రబాబు స్వామి వారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే వ్యాఖ్య లపై సిట్ అధికారులు తనను స్పష్టత ఇవ్వాలని కోరారన్నారు. 2019 నుంచే కాకుండా 2014 నుం చి.. వీలైతే అంతకు ముందు నుంచి కూడా టీటీడీకి నెయ్యి సరఫరా వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామ న్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. ఏపీ సీఎం చంద్రబాబు వైఎస్సా ర్ సీపీ ప్రభుత్వ హయాంలో స్వామి వారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా భక్తుల మనోభా వాలు దెబ్బతిన్నాయి. ఇద్దరు ముగ్గురు భక్తులతో పాటు మేము కూడా భక్తులకు వాస్తవాలు తెలి యాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం. దేశ సర్వో న్నత న్యాయ స్థానం సిట్ను నియమిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎఫ్ఎఆర్ నమోదైన తర్వాత విచారణ చేయకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కీలక పదవుల్లో ఉండే వ్యక్తులు కామెం ట్ల చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. 2024 జూన్ లో నాలుగు ట్యాంకుల ద్వారా కల్తీ నెయ్యి (అడల్టెడ్) సరఫరా చేశారా? అందులో జంతువుల కొవ్వు కలిసిందా? లేకుంటే ఏ విధంగా కల్తీ జరిగిం దో నిర్ధారించాలని సిట్ను సుప్రీంకోర్టు ఆదేశించిం ది. మొదట వాటిని నివృత్తి చేయాలని సిట్ అధికా రులను కోరాను. అయితే, అధికారులు విచారణ పూర్తి కాలేదని చెబుతున్నారు. కానీ, ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీట్లో కల్తీ నెయ్యిలో వెజిట బుల్ ఆయిల్స్ వంటివి మాత్రమే కలిశాయని పాం దుపరిచారు. వెనక్కి వెళ్లిన ట్రక్కులు మళ్లీ వేరే పేరుతో వచ్చాయని, వాటిని వాడారని చార్జిషీ ట్లోనే పొందుపరిచారు. అందులో జంతువుల కొవ్వు కలిసిందా... లేక పామాయిల్, ఇతర వాటి ద్వారా కల్తీ జరిగిందా అని సిట్ అధికారులు చెప్పా లి. పది రోజుల నుంచి ఓ వర్గం మీడియాలో నా మాజీ పీఏ చిన్న అప్పన్నను అడ్డుపెట్టుకుని నేను అవినీతికి పాల్పడినట్టు దుష్ప్రచారం చేయడం దారుణం. ఆయనతో 2018 తర్వాత నాకు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి దుష్ప్రచారాన్ని ఆపాలి. స్వామివారి ప్రతి రూపాయి కాపాడాం శ్రీనివాసే సేతు బ్రిడ్జి కోసం సుమారు రూ.690 కోట్లు కేటాయిస్తే.. మేము రూ.90-100 కోట్లు వరకు తగ్గించి నిర్మాణం చేయించి స్వామి ప్రతి రూపాయి కాపాడటానికి శ్రమించాం. టీడీపీ ప్రభుత్వం రూ.1,100 కోట్లు స్వామివారి కానుక నిధులు ఎస్ డిపాజిట్ చేస్తే దానిని జాతీయ బ్యాంకుల్లోకి మార్పించి కాపాద గలిగాం. ద్వారా దళారులను నిర్మూలించాం. దేశవ్యాప్తంగా దేవాలయాలు నిరి ప్రారంభించాం. ్మంచాం. పద్మావతి హృదయాలయ ఆస్పత్రిలో చిన్నారుల ప్రాణాలను కాపాడటానికి నిధులు వెచ్చించాం. ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టిన వైవీ సుబ్బారెడ్డి టీటీడీ నెయ్యి కేసులో టీడీపీ ప్రభుత్వ కుట్రను వైయస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి దీటుగా తిప్పికొట్టారు. ప్రభుత్వం నమోదు చేసిన ఈ అక్రమ కేసులో సిట్ అధి కారులు ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని హైదరాబా ద్ లోని ఆయన నివాసంలో గురువారం విచారిం చారు. ఉ. 10.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విచారణ పేరుతో సిట్ అధికారులు ప్రజ లను తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. సాయంత్రం ఆరు గంటల నుంచి 11 గంటల వరకు ఎటువంటి విచారణ లేకుండానే సిట్ అధి కారులు కాలయాపన చేశారు. కేవలం 12 గంటల పాటు వైవీ సుబ్బారెడ్డిని విచారించామనే భావన కల్పించేందుకు ఈ ఎత్తుగడ వేశారు. టీటీడీ వ్యవ హారాలపై సిట్ ఆరోపణలను వైవీ సుబ్బారెడ్డి సమర్థంగా తిప్పికొట్టారు. టీటీడీ చైర్మన్ హోదాలో ఎటువంటి అవినీతికి పాల్పడలేదని పూర్తి వివ రాలతో వెల్లడించారు. నెయ్యి కాంట్రాక్టుల్లో, ఇతర కాంట్రాక్టుల్లో ఒక్క రూపాయి కూడా అవినీతి జర గలేదని ఆయన తేల్చి చెప్పారు. కిలో నెయ్యి రూ.351తో కొనుగోలు చేస్తే నాసిరమైన నెయ్యి సరఫరా చేశారని ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం గగ్గోలు పెడుతోందని, గతంలో ఇదే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కిలో నెయ్యి కేవలం రూ.276 చొప్పున కొనుగోలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరి అప్పుడు నాసిరకమైన నెయ్యి సరఫరా చేశారని సీఎం చంద్రబాబు అంగీ కరిస్తారా? అని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. వీటిపై సిట్ అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలినట్టు తెలుస్తోంది