విద్యుత్‌ సంస్థలను లాభాల బాట పట్టించాం

విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి

విజయవాడ: విద్యుత్‌ సంస్థలను లాభాల బాట పట్టించామని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రూ.70 వేల కోట్ల అప్పుల్లో ఉన్న విద్యుత్‌ సంస్థలను ఆదుకున్నామని స్పష్టం చేశారు. విజయవాడలో మంత్రి బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామన్నారు. రూ.17 వేల కోట్లతో వ్యవసాయ ఫీడర్లను మెరుగుపరిచామన్నారు. విద్యుత్‌ రంగాన్ని పట్టిష్టం చేయడానికి 7 వేలకుపైగా జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులు భర్తీ చేశామని, 172 మంది అసిస్టెంట్‌ ఇంజినీర్ల నియామకం చేపట్టామన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top