ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 
 

ఒంగోలు : ఇసుక అక్రమ తరలింపు విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని.. ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. చిన్నగంజాంలో ఇసుక అక్రమ తరలింపు విషయంలో తన కుమారుడిపై సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.  గురువారం ఒంగోలులో ఆయన విలేకరులతో మాట్లాడారు.  గత ప్రభుత్వం ఎక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేయడం వల్లనే పీపీఏలపై కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ఇక వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అదే విధంగా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తామని మంత్రి తెలిపారు. 

Read Also: యువతను తీర్చిదిద్దే బాధ్యత మనదే

తాజా ఫోటోలు

Back to Top