మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరిద్దాం 

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

విజయవాడ: రాష్ట్రంలో జగనన్న పచ్చ తోరణం కార్యక్రమంలో భాగంగా విరివిగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరిద్దామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. మంగళగిరి ఎయిమ్స్‌ ఆవరణలో రేపు వన మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. జగనన్న పచ్చ తోరణం–వన మహోత్సవం కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొననున్నారని మంత్రి వెల్లడించారు.ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఎయిమ్స్‌ ఆవరణలో మొక్కలు నాటనున్నారని తెలిపారు.

వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా  రాష్ట్రంలో మొక్కలు నాటే బృహత్తర లక్ష్యంతో వన మహోత్సవం కార్యక్రమం తలపెట్టినట్లు చెప్పారు. గత రెండేళ్లలో 33.23 కోట్ల మొక్కలు నాటామని మంత్రి తెలిపారు. ఈసారి కూడా విరివిగా మొక్కలు నాటుదామని మంత్రి అన్నారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top